Jan abraham
-
ఫస్ట్‌లుక్ 4th July 2018
-
న్యాయం ధ్వనిస్తుంది
‘నేరగాళ్లకు శిక్ష తప్పదు. అవినీతికి అంతం తప్పదు’ అంటున్నారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం. మిలప్ జవేరి దర్శకత్వంలో జాన్ అబ్రహాం కథానాయకుడిగా నటించిన సినిమా ‘సత్యమేవ జయతే’. మనోజ్ బాజ్‌పేయి, అమృత కవిల్వర్, ఐషా శర్మ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయం ధ్వనిస్తుంది’’ అని సినిమాను ఉద్దేశించి సోషల్ మీడియాలో పేర్కొన్నారు జాన్. అయితే ఇదే రోజున అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన హాకీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘గోల్డ్’ రిలీజ్ కానుంది. సో.. బాక్సాఫీస్ వద్ద అక్షయ్ వర్సెస్ జాన్ తప్పదన్నమాట. -
తమన్నా.. పూజ... ఓ సారీ
మిల్కీ బ్యూటీ తమన్నా, గ్లామర్ గర్ల్ పూజా హెగ్డే సారీ చెప్పారు. సారీ చెప్పేటంత తప్పు వీరేం చేశారు? ఎవరికి క్షమాపణ చెప్పారు? అనేగా మీ డౌట్. అసలు సంగతి ఏంటంటే.. జాన్ అబ్రహాం, మనోజ్ బాజ్‌పేయి ముఖ్య పాత్రల్లో ‘రాక్’ అనే సినిమా తెరకెక్కనుంది. మిలాప్ ఝవేరి దర్శకత్వంలో నిఖిల్ అద్వానీ అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించనున్నారట. ఇందులో కథానాయిక చాన్స్‌కి అటు తమన్నా ఇటు పూజా హెగ్డే ‘సారీ.. కుదరదు’ అన్నారని బాలీవుడ్ టాక్. ‘రాక్’ చిత్రంలో జాన్ అబ్రహాంతో జోడీ కోసం తొలుత తమన్నాను సంప్రదించారట చిత్రబృందం. మొదట సరే అన్న మిల్కీబ్యూటీ తర్వాత ‘సారీ నేను చేయలేను’ అంటూ తప్పుకున్నారట. ఆ పాత్రకు ఎవరైతే బాగుంటారా? అని సెర్చ్ చేసిన చిత్రబృందం ‘మొహెంజొదారో’తో బాలీవుడ్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే కరెక్ట్ అనుకున్నారట. ఆమెను సంప్రదించగా సింపుల్‌గా ‘సారీ’ అన్నారట. తమన్నా ఎందుకు తప్పుకున్నారు? ఇటువంటి మంచి అవకాశాన్ని పూజా హెగ్డే వదులుకోవడానికి కారణం ఏంటి? అన్నది తాజా బాలీవుడ్ టాక్. అబ్రహాంకి మంచి హిట్లు లేకపోవడం వల్లే అని కొందరు అంటుంటే.. కాదు.. కాదు.. ‘రాక్’లో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉండటం వల్లే తప్పుకున్నారంటున్నారు మరికొందరు గాసిప్‌రాయుళ్లు. మరి.. జాన్‌కి జోడీగా ఎవరు ‘యస్’ అంటారో? -
రోమ్‌లో సరదాగా..!
బిపాసా బసు గత జీవితంలో కీలక ఘట్టం జాన్ అబ్రహాంతో చేసిన తొమ్మిదేళ్ల సహజీవనం. అప్పట్లో అది మధురంగా అనిపించిన బిప్స్కి, ఇప్పుడది పీడకలలా తయారయ్యింది. జాన్ నుంచి విడిపోయిన తర్వాత అతని జ్ఞాపకాలను చెరిపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి, సక్సెస్ అయ్యారామె. కానీ, ఇటీవల జాన్ అబ్రహాం పెళ్లి చేసుకోవడంతో మరోసారి గతంలోకి వెళ్లిపోయి, దిగులుగా ఉంటున్నారట బిపాసా. ఆమె బాధను తాజా ప్రియుడు హర్మాన్ బవేజా చూడలేకపోతున్నారట. బిపాసాని ఆ మూడ్ నుంచి బయటపడేయడానికి ఎక్కడికైనా విహారయాత్రకు తీసుకెళితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారని వినికిడి. రోమ్ అంటే బిపాసాకి చాలా ఇష్టం అట. అందుకని, అక్కడికి తీసుకెళితే బిపాసా మామూలు మనిషి అవుతుందన్నది హర్మాన్ అభిప్రాయం. వీలు చూసుకుని ప్రేయసితో రోమ్ చెక్కేయాలనుకుంటున్నారట.