sathyameva jayathe
-
Satyameva Jayate: చిదిమేస్తున్న చదువులు.. ప్రతిభకు కొలమానం ర్యాంకులేనా?
-
ట్రాఫిక్ లోనే సగం జీవితం.. కొవ్వొత్తిలా కరిగిపోతున్న సమయం.. సమస్య తీరేది ఎప్పుడు..?
-
పబ్స్ లో చీకటి బాగోతాల వెనుక ఉన్న చెయ్యి.. డ్రగ్స్ దందా సాగుతుందెలా..?
-
యంత్రమా..? కుతంత్రమా..? ఎలాన్ మాస్క్, శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు చెబుతున్నదేంటి.. ?
-
కంప్రమైజ్ అయితేనే అవకాశాలు.. ఈ పరిస్థితి కల్పించిన వారిది తప్పు కదా
-
ఫిరాయింపుల చట్టంలో లొసుగులు..
-
హోటల్స్ లో వేడివేడిగా టేస్టీ టేస్టీ పాయిజన్..
-
వీధి కుక్కలతో తస్మాత్ జాగ్రత్త !
-
దేశాన్ని కమ్మేస్తున్న మత్తు మబ్బులు.. సినిమా ప్రభావమా?.. వ్యవస్థలో లోపమా ?
-
సత్యమేవ జయతే 1948
ఎం.వై.ఎం.క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే 1948’. ఈశ్వరబాబు. డి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పి.జితేంద్రకుమార్ కెమెరా స్విచాన్ చేయగా శరద్ దద్భావాలా క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత ఎం.వై. మహర్షి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన టైమ్‌లోని ముఖ్య నేతలు గాంధీ, నెహ్రూ, గాడ్సే, మహ్మద్ అలీ జిన్నా తదితర పాత్రలతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించి, గాడ్సే పాత్ర చేస్తున్న ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ– ‘‘11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి కథ తయారు చేయడం జరిగింది. 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 500కి పైగా ప్రోపర్టీస్, 370కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్‌లో. 9 షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. -
న్యాయం ధ్వనిస్తుంది
‘నేరగాళ్లకు శిక్ష తప్పదు. అవినీతికి అంతం తప్పదు’ అంటున్నారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం. మిలప్ జవేరి దర్శకత్వంలో జాన్ అబ్రహాం కథానాయకుడిగా నటించిన సినిమా ‘సత్యమేవ జయతే’. మనోజ్ బాజ్‌పేయి, అమృత కవిల్వర్, ఐషా శర్మ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయం ధ్వనిస్తుంది’’ అని సినిమాను ఉద్దేశించి సోషల్ మీడియాలో పేర్కొన్నారు జాన్. అయితే ఇదే రోజున అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన హాకీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘గోల్డ్’ రిలీజ్ కానుంది. సో.. బాక్సాఫీస్ వద్ద అక్షయ్ వర్సెస్ జాన్ తప్పదన్నమాట. -
గుచ్చిగుచ్చి ప్రశ్నించదు ‘గౌరవి’
ప్రభుత్వాలు.. తీసుకునే చర్యలు తీసుకుంటున్నా, మహిళలపై దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అయితే, ఇలాంటి వార్తలను ఇంకా ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో అత్యాచారాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ‘యాక్షన్ ఎయిడ్’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో భూపాల్‌లోని జై ప్రకాష్ హాస్పిటల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘గౌరవి’ అనే సహాయకేంద్రాన్ని నెలకొల్పింది. అత్యాచార బాధితులు, గృహహింసను అనుభవిస్తున్నవారు, అదనపు కట్నం వేధింపులకు గురవుతున్నవారు, ఇంకా అనేకరకాలైన దౌర్జన్యాలను ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. వైద్య సహాయం పొందవచ్చు. న్యాయపోరాటం జరుపవచ్చు. తమకు జరిగిన అన్యాయంపై కేసుపెట్టవచ్చు. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయాలను ‘గౌరవి’ సిబ్బంది అందిస్తారు. వాళ్లేమీ ఆషామాషీ సిబ్బంది కాదు. బాగా చదువుకున్నవారు, వైద్యవృత్తిలో ఉన్నవారు, చట్టం గురించి తెలిసిన వారు, పోలీసు శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్న వారు. అన్నిటినీ మించి, ఆపదలో సహాయం కోసం వచ్చిన మహిళలను సగౌరవంగా కూర్చోబెట్టి, వారి బాధను ఓపిగ్గా విని, అవసరమైతే కౌన్సెలింగ్ కూడా ఇచ్చి, వారికి తమ సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా వారి మనసు బాధపడేలా గుచ్చిగుచ్చి ప్రశ్నించరు. దేశంలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌లో ఇలాంటి కేంద్రం ఒకటి ఉండడం వల్ల బాధిత మహిళలకు పూర్తి భరోసా కాకపోవచ్చు కానీ, కొంత ప్రయోజనం ఉంటుందని ‘గౌరవి’ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ హీరో, ‘సత్యమేవ జయతే’ టీవీ షో రూపకర్త ఆమిర్ ఖాన్ ఇదివరకే తన షోలో మహిళపై జరుగుతున్న అత్యాచారాలపై హృద్యమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు కనుక ఆయనను‘గౌరవి’ ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమిర్ మాట్లాడుతూ ‘‘మార్పు ఒక్క రోజుతో వచ్చేయదు. మొదట ఆడవాళ్ల పట్ల మగవాళ్ల వైఖరి మారాలి. అంతవరకు ఎవరి పరిధిలో వాళ్లు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు విప్పాలి’’ అన్నారు. కాగా, భోపాల్‌తో పాటు మిగిలిన 50 జిల్లాల్లోనూ ‘గౌరవి’ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. అయితే ‘గౌరవి’ లాంటి సహాయ కేంద్రాలు బాధితులకు ఎంతవరకు తోడ్పడతాయి అనే విషయమై సామాజిక కార్యకర్తలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘సిబ్బందిలో అధికారులు, నిపుణులు, వైద్యులు ఉండడం సంతోషించదగిన విషయమే. అయితే వారు క్రమం తప్పకుండా కేంద్రానికి వస్తారా?’’ అంటారు రోలీ షివ్రానే అనే కార్యకర్త. ఏదైనా ఒక ప్రయత్నం అంటూ జరిగింది. క్రమంగా ఫలితాలు ఉంటాయని ఆశించవచ్చు. -
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్పై మచ్చ!
అమితాబ్ బచ్చన్ అంటే సూపర్‌స్టార్ అని టకీమని చెప్పేస్తాం. మరి ఆమిర్ ఖాన్ గురించి చెప్పమంటే వెంటనే ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని చెప్పేస్తారు. వివాదాలకు, అనవసరపు ప్రచార ఆర్భాటాలకు చాలా దూరంగా ఉన్నట్టు కనపడే ఆమిర్, ‘సత్యమేవ జయతే’ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత నీతీ, నిజాయితీకీ చిరునామా అన్నంత ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. అలా ‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమిర్ తన స్వార్థం కోసం ముంబయ్‌లోని బాంద్రాలో నివసిస్తున్నవారిని ఇబ్బందులపాలు చేస్తున్నారనే వార్త వెలుగులోకొచ్చింది. ఆ ఏరియాలో ఆమిర్ పెద్ద బంగ్లా ఒకటి కట్టుకోవాలనుకుంటున్నారట. దాదాపు 20వేల చదరపు అడుగుల్లో భవంతి కట్టించాలన్నది ఆయన ఆలోచన అని సమాచారం. బాంద్రాలోని హౌసింగ్ సొసైటీవారిని సంప్రదించి, అక్కడ నివసిస్తున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా కోరారట ఆమిర్. దాంతో ఆ హౌసింగ్ సొసైటీ రంగంలోకి దిగిందని వినికిడి. ఆమిర్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు, ఆ ఏరియా నుంచి మారినా ఫర్వాలేదనుకున్నవాళ్లు తమ ఇళ్లను అమ్మడనికి పచ్చజెండా ఊపారట. కానీ, పమేలా అనే 87ఏళ్ల వృద్ధురాలు, ఆమె కూతురు మాత్రం ఆమిర్‌కి అడ్డం తిరిగారని తెలిసింది. తమను ఒత్తిడి చేస్తున్న హౌసింగ్ సొసైటీపై కేసు కూడా పెట్టారట ఈ తల్లీకూతుళ్లు. ఉత్తమ నటుడిగానే కాకుండా ఉత్తమ లక్షణాలున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఈ విధంగా చేయడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ ఇలా చేయడం తగదని చెప్పుకుంటున్నారు.