
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తొలి అడుగును విజయవంతంగా ముగించారు సమంత. ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించారామె. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ తొలి సీజన్‌కు గత ఏడాది డిజిటల్ ఎంటర్‌టైన్ మీడియమ్‌లో మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్‌లు కీలక పాత్ర పోషించారు. రెండో సీజన్‌లో సమంత ఓ లీడ్ చేశారు. ఆమె పాత్ర చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ– ‘‘ది ఫ్యామిలీమేన్’ సీజన్ 2’ షూటింగ్‌కి సంబంధించిన ఏ రోజునీ నేను మర్చిపోలేను. ఇదివరకు నేను వెండితెరపై నటించిన పాత్రలకు ఇది పూర్తి విభిన్నమైనది.
అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకేలకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మేము యాక్షన్ అని చెప్పిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు (సమంత) మలచుకున్న విధానం అద్భుతం. ఇప్పుడు ఉన్న ప్రతిభావంతులైన నటీమణుల్లో మీరూ ఒకరు. ఈ పాత్ర మీ కంఫర్ట్ జోన్‌లోది కాకపోయినప్పటికీ అద్భుతంగా నటించారు’’ అని సమంతను ఉద్దేశించి రాజ్ అండ్ డీకే అన్నారు. అది మాత్రమే కాదు.. ‘రెబల్‌స్టార్ సామ్!’ అని కేక్‌పై రాయించి సెట్‌లో కట్ చేయించారు యూనిట్. మరోవైపు సమంత ఓ టాక్ షో కూడా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్, సమంత నటించిన ‘జాను’ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment