ఆ సినిమా మా మనోభావాలు దెబ్బతీసింది! | Complaint filed against Satyameva Jayate in Hyderabad | Sakshi
Sakshi News home page

‘సత్యమేవ జయతే’ సినిమాపై కేసు నమోదు

Published Mon, Jul 30 2018 5:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Complaint filed against Satyameva Jayate in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాన్‌ అబ్రహం, మనోజ్‌ బాజ్‌పేయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ సినిమా ‘సత్యమేవ జయతే’పై నగరంలో కేసు నమోదైంది. తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని షియా వర్గం సోమవారం కేసు నమోదు చేసింది.

ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై గతంలోనూ అభ్యంతరాలు వచ్చాయి. ముస్లింలు పవిత్రంగా భావించే మొహర్రం ఊరేగింపును మతమనోభావాలు దెబ్బతీసేవిధంగా చిత్రం ట్రైలర్‌లో చూపించారని, ఈ సనివేశాలను వెంటనే తొలగించి.. చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు గతంలో కోరాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో కేసు నమోదు కావడం గమనార్హం.

మిలాప్‌ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్యమేవ జయతే’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్‌ అబ్రహం సరసన అమృత ఖన్విల్కర్‌ నటించారు. ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement