religious sentiments
-
కంగనాపై దేశద్రోహం కేసు
ముంబై: ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెట్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కంగనా, ఆమె సోదరి గత రెండు నెలలుగా ట్వీట్లు, వివాదాస్పద ప్రకటనలు, ఇంటర్వ్యూలతో సమాజంలోని వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునావర్ అలీ సయ్యద్ బాంద్రా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనా, రంగోలిపై ఐపీసీ సెక్షన్ 153ఏ(మతం, వర్గం ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మత విశ్వాసాలను గాయపర్చడం), 124ఏ (దేశద్రోహం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సయ్యద్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బంధుప్రీతి అంటూ బాలీవుడ్ కళాకారుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రజల మత విశ్వాసాలను కించపర్చారని తెలిపారు. -
కేసు విషయంపై స్పందించిన రవీనా టండన్
బాలీవుడ్ నటి రవీనా టండన్ తన మీద నమోదు అయిన కేసు విషయంపై శుక్రవారం స్పందించారు. క్రిస్మస్ సందర్భంగా టెలివిజన్‌లోని షోకు హాజరైన రవీనా టంబన్ క్రైస్తవ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిందని క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ బుధవారం అజ్నాలా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమృత్సర్ పోలీసులు రవీనా టండన్తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్, కమెడియన్ భారతి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై స్పందించిన రవీనా ఎవరినీ అవమానించడం తన ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ..‘నేను ఎవరినీ కించపరచాలని అనుకోలేదు. ఏ మతాన్ని తక్కువ చేసి, అవమానించినట్లుగా మాట్లాడలేదు. ఒకవేళ ఎవరైనా నావల్ల బాధపడితే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని చూడండి’ అని టెలివిజన్ షోలో ప్రసారమైన వీడియో క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు. -
చిక్కుల్లో ఆ ముగ్గురు
అమృత్సర్: బాలీవుడ్ సెలబ్రిటీలు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పంజాబ్‌లో కేసు నమోదైంది. ఒక టెలివిజన్ షోలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్న ఫిర్యాదుపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరాఖాన్, భారతి సింగ్ క్రిస్టయన్ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. సంబంధిత షో వీడియో ఫుటేజీని కూడా ఫిర్యాదుదారుడు అందించినట్టు తెలిపారు. 295 -ఏతోపాటు వివిధ సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృతసర్ రూరల్ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. -
ఆ సినిమా మా మనోభావాలు దెబ్బతీసింది!
సాక్షి, హైదరాబాద్: జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా ‘సత్యమేవ జయతే’పై నగరంలో కేసు నమోదైంది. తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని షియా వర్గం సోమవారం కేసు నమోదు చేసింది. ఆన్లైన్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై గతంలోనూ అభ్యంతరాలు వచ్చాయి. ముస్లింలు పవిత్రంగా భావించే మొహర్రం ఊరేగింపును మతమనోభావాలు దెబ్బతీసేవిధంగా చిత్రం ట్రైలర్లో చూపించారని, ఈ సనివేశాలను వెంటనే తొలగించి.. చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు గతంలో కోరాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో కేసు నమోదు కావడం గమనార్హం. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్యమేవ జయతే’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్ అబ్రహం సరసన అమృత ఖన్విల్కర్ నటించారు. ఆన్లైన్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
మతపరమైన వ్యాఖ్యలు: సల్మాన్‌పై కేసు
ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఆల్ ఇండియన్ ఖ్వామీ తన్జీమ్ విదర్భ యూనిట్ అధినేత మహ్మద్ అలీ చేసిన ఫిర్యాదు మేరకు సల్మాన్ మీద ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సల్లూభాయ్ కావాలనే చేసిన వ్యాఖ్యల వల్ల, పనుల వల్ల మతపరమైన విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని, ఒక మతాన్ని, లేదా ఒక మతస్థుల నమ్మకాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. సల్మాన్ ఏర్పాటుచేసిన 'బీయింగ్ హ్యూమన్' అనే స్వచ్ఛంద సంస్థ ముంబైలో ఒక ఫ్యాషన్ షో నిర్వహించింది. ఆ షోలో ఒక మోడల్ 'అల్లా' అని అరబిక్ భాషలో తన డ్రస్సు మీద రాసుకుని ర్యాంపు మీద నడిచింది. సల్మాన్ ఖాన్ మీద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా అలీ పోలీసులకు సమర్పించారు. -
రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
చందానగర్: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై చందానగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో హిందువుల మనోభావలను దెబ్బతీసేవిధంగా వినాయకునిపై చేసిన వాఖ్యలపై సామాజిక కార్యకర్త కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. తనను తాను ర క్షించుకోలేని వినాయకుడు భక్తులను ఎలా రక్షిస్తాడని వర్మ ట్విట్ చేశాడని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినాయకుని భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.