ప్రతీ వారం 'ఎన్ కౌంటర్' లో ఓ గ్యాంగ్ స్టర్ | 'Encounter' gripping, interesting show, says Manoj Bajpayee | Sakshi
Sakshi News home page

ప్రతీ వారం 'ఎన్ కౌంటర్' లో ఓ గ్యాంగ్ స్టర్

Published Thu, Apr 10 2014 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

'Encounter' gripping, interesting show, says Manoj Bajpayee

ముంబై: వీక్షకులకు గ్యాంగ్ స్టర్ల కథలంటే ఎప్పడూ ఆసక్తి కరమే. అది వెండి తెరపై కావచ్చు. బుల్లి తెరపై కావచ్చు. ఇప్పటికే ఇటువంటి  కథలతో వచ్చిన సినిమాలు  ప్రేక్షక్షుల్ని అమితంగా ఆకర్షించడమే కాకుండా,  బుల్లి తెరను కూడా ఈ తరహా కథలు ఆకట్టుకుంటూనే ఉంటున్నాయి.  తాజాగా సోనీ ఎంటర్ టైనమెంట్ టెలివిజన్ ' ఎన్ కౌంటర్' కార్యక్రమం పేరుతో శుక్రవారం నుంచి వీక్షకుల ముందుకు రానుంది.  దీనికి బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎన్ కౌంటర్ కార్యక్రమంలో కనిపిస్తాయని  మనోజ్ తెలిపారు.

 

ముంబై నగరంలో పోలీసులకు, గ్యాంగ్ స్టర్లకు మధ్య జరిగిన పోరాట సన్నివేశాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నట్లు ఆయన స్ఫష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రతీ వారం ఒక గ్యాంగ్ స్టర్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.ఇక్కడ ఫలానా వారే చూడాలనే నియమాలు ఏమీ లేవని, ఏ వయసులో వారైనా ఎన్ కౌంటర్ కార్యక్రమాన్ని చూడవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement