Sony Entertainment Television
-
సోనీ స్పోర్ట్స్ చిత్రాలకు WWE రింగ్‌లోకి దిగిన హీరో కార్తీ..
భారతదేశంలో డబ్ల్యుడబ్ల్యుఇ అధికారిక ప్రసారకర్త అయిన సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ WWE ఫ్యాన్స్‌కు మరింత దగ్గర కానుంది. డబ్ల్యుడబ్ల్యుఇ అభిమాని, సౌత్ సినీ సూపర్ స్టార్ కార్తీ నటించిన రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను సోనీ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఇది దక్షిణాది మార్కెట్లలో డబ్ల్యుడబ్ల్యుఇ చుట్టూ కస్టమైజ్డ్, స్థానికంగా క్యూరేటెడ్ కంటెంట్‌కు దాని నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. డబ్ల్యుడబ్ల్యుఇ కోసం కార్తి తన గొంతును అందించడమే కాకుండా ఆ కార్యక్రమానికి ప్రచారకార్యకర్తగా కూడా ఉన్నారు. 'హీరోలు vs విలన్లు, అనే టైటిల్‌తో పాటు 'బలం vs విన్యాసాలు' అనే రెండు కాన్సెప్ట్‌లతో ఇవి రానున్నాయి. డబ్ల్యుడబ్ల్యుఇని అభిమానులు సాదరంగా స్వాగతిస్తున్నారు. దీనిని చాలామంది ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. దక్షిణాది మార్కెట్లో సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ WWE ప్రసారాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎక్కువ ప్రోగ్రామ్‌లు అందించడానికి కట్టుబడి ఉంది. ఈ చిత్రాలు ప్రేక్షకులు వారి అభిమాన డబ్ల్యుడబ్ల్యుఇ స్టార్లకు దగ్గరగా ఉంచడంలో పాటుపడుతుంది. ప్రతి వారం వారు తీసుకువచ్చే అన్ని మైండ్ బ్లోయింగ్ యాక్షన్లకు అదనంగా ఈ చిత్రాలు ఉన్నాయి. సోనీ నెట్ వర్క్ ఛానల్స్‌లలో WWE లైవ్ ద్వారా ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా డిస్ట్రిబ్యూషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, స్పోర్ట్స్ బిజినెస్ విభాగాధిపతి రాజేష్ కౌల్ మాట్లాడుతూ, 'డబ్ల్యుడబ్ల్యుఇకి దక్షిణ భారతదేశంలో చాలా బలమైన అభిమానులు ఉన్నారు. ఇక్కడ దీని కోసం భారీగా రీచ్ ఉంది. సుమారు 41% వాటా ఉంది. భారతదేశంలో డబ్ల్యుడబ్ల్యుఇ నివాసంగా, కార్తీతో కలిసి పనిచేయడానికి, ప్రేక్షకులను ప్రతిధ్వనించే తమిళ, తెలుగులలో అసాధారణ కథలను అందించడానికి మా ప్రయత్నాలను కొనసాగించడానికి మేము ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. ఈ చిత్రాలు డబ్ల్యుడబ్ల్యుఇ ఆకర్షణను పునఃసమీక్షిస్తాయి. ఇది హై-ఆక్టేన్ విన్యాసాలతో పాటు ఆకర్షణీయమైన పాత్రలతో నడుస్తుంది. మా ప్రేక్షకులకు ఉత్తమమైన, స్వచ్ఛమైన స్పోర్ట్స్ వినోదాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.' అని చెప్పారు. ఈ సందర్భంగా దక్షిణాది సూపర్ స్టార్ కార్తీ మాట్లాడుతూ.. 'డబ్ల్యుడబ్ల్యుఇలో హీరోలు, విలన్ల పాత్రలను పోషించడం ఖచ్చితంగా నాకు మరపురాని అనుభవం. వారిని యాక్షన్ లో చూడటం చాలా ఆనందంగా ఉంది. డబ్ల్యుడబ్ల్యుఇకి భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక అభిమానిగా, సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్, డబ్ల్యుడబ్ల్యుఇతో కలిసి పనిచేయడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది.' అని తెలిపారు. ఇంతకుముందు భారతీయ సినిమాల్లో హీరోలు, విలన్ల పాత్రలు పోషించిన కార్తీ.. ఆ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా హీరోలు, విలన్ల శక్తిని పూర్తిగా చూపించాడు. కార్తీ తన అభిరుచి, మచ్చలేని రోల్ ప్లేతో, సౌత్ మార్కెట్లో డబ్ల్యుడబ్ల్యుఇకి అంకితమైన అభిమానుల కోసం సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రచారానికి జీవం పోశాడు. క్రియేటివ్ కాన్సెప్ట్, సినిమాలకు దర్శకత్వం సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ నిర్వహించింది. -
జీ–సోనీ డీల్‌కు బ్రేక్?
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) – సోనీ భారత విభాగం విలీన ప్రయత్నాలకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థకు జీ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించే విషయంపై సోనీ సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నిర్దిష్ట షరతులను పాటించలేదనే కారణంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సోనీ గ్రూప్ భావిస్తున్నట్లు తెలిపారు. డీల్ కుదుర్చుకునేందుకు నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే జనవరి 20లోగా రద్దు నోటీసును పంపించే అవకాశం ఉందని వివరించాయి. వివరాల్లోకి వెళ్తే.. జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ తమ భారత విభాగాన్ని, జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సాకారమైతే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజంగా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. సదరు ఒప్పందం ప్రకారం జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర తనయుడు, సీఈవో పునీత్ గోయెంకానే విలీన సంస్థకు కూడా సారథ్యం వహించాలి. కానీ, ఈలోగా చంద్ర, గోయెంకాలు తమ అధికారాన్ని దురి్వనియోగం చేసి సొంత అవసరాల కోసం నిధులను మళ్లించారంటూ సెబీ ఆరోపించడంతో డీల్ పురోగతిపై సందేహాలు రేకెత్తాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన వివాదంగా పరిగణిస్తున్న సోనీ.. విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పజెప్పడానికి విముఖంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, ముందుగా అనుకున్న ప్రకారం సీఈవోగా తనని కొనసాగించాల్సిందేనంటూ గోయెంకా పట్టుబడుతున్నట్లు వివరించాయి. ఈ నేపథ్యంలోనే డీల్‌ను సోనీ రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
హిందువుల మనోభావాలు కించపరిచారని..
ముంబై: అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది. అలాంటిది ఈ కార్యక్రమంలో హిందువులను కించపరిచారంటూ మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ ఆరోపించారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాత అమితాబ్ బచ్చన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సోనీ టెలివిజన్‌లో అక్టోబర్ 30న ప్రసారమైన ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోని అతిథులుగా వచ్చారు. కార్యక్రమంలో భాగంగా రూ.6.40 లక్షల ప్రైజ్‌మనీ కోసం‘1927 డిసెంబర్ 25న డాక్టర్ అంబేడ్కర్, అతని అనుచరులు ఈ ప్రతుల్లో వేటిని తగులబెట్టారు?’ అనే ప్రశ్నను అమితాబ్ అడిగారు. ఎ)విష్ణు పురాణం, బి) భగవద్గీత, సి) రుగ్వేదం, డి) మనుస్మృతి అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. కుల వివక్ష, అస్పృశ్యతలను వ్యతిరేకిస్తూ అంబేడ్కర్, అతని అనుచరులు మనుస్మృతి ప్రతులను తగులబెట్టారని ఆ తర్వాత అమితాబ్ ప్రశ్నకు సమాధానంగా వివరణ ఇచ్చారు. అయితే, ఈ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ అమితాబ్‌పై, సోనీ ఎంటర్టైన్మెంట్పై చర్యలు తీసుకోవాలని అభిమన్యు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాధానాలన్నీ హిందూమతానికి సంబంధించిన గ్రంథాలవని, ప్రశ్నలోని ఉద్దేశం హిందువుల మనోభావాలు కించపరచడమేనని అభిమన్యు ఆరోపించారు. -
అంబానీ చానెల్స్‌లో ‘సోనీ’కి వాటా...!
ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి నెట్వర్క్ 18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరకపోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ‘స్థానిక’ బలం కోసం సోనీ..... నెట్వర్క్18లో వాటా కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనే విషయమై కూడా సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. నెట్వర్క్18లో వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్వర్క్18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్ తదితర పోటీ సంస్థలకు గట్టిపోటీనివ్వగలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్ కంటెంట్‌కు యాక్సెస్ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సంస్థ భారత, జపాన్ విభాగాలు ఎలాంటి స్పందనను వ్యక్తం చేయలేదు. రెండేళ్లలో మరిన్ని భాగస్వామ్యాలు.... భారత ఓటీటీ మార్కెట్లో అపార అవకాశాలున్నాయి. ఏ అంతర్జాతీయ సంస్థయినా, ఇక్కడి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే స్థానిక వ్యూహం తప్పనిసరని నిపుణులంటున్నారు. రానున్న రెండేళ్లలో ఇలాంటి భాగస్వామ్యాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరిన్ని చోటు చేసుకుంటాయని వారంటున్నారు. సోనీ కంపెనీ భారత్‌తో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ద్వారా వివిధ చానెళ్లను నిర్వహిస్తోంది. ఇక టీవీ18 బ్రాడ్కాస్ట్ సంస్థ మొత్తం 56 చానెళ్లను (వార్తలు, వినోద విభాగాలు) నిర్వహిస్తోంది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఇంట్రాడేలో నెట్వర్క్18 మీడియా షేర్ 19%, టీవీ18 బ్రాడ్కాస్ట్ షేర్ 10% మేర పెరిగాయి. చివరకు నెట్వర్క్18 షేర్ 8% లాభంతో రూ.27.70 వద్ద, టీవీ18 బ్రాడ్కాస్ట్ 1.5% లాభంతో రూ. 23 వద్ద ముగిశాయి. -
ప్రతీ వారం 'ఎన్ కౌంటర్' లో ఓ గ్యాంగ్ స్టర్
ముంబై: వీక్షకులకు గ్యాంగ్ స్టర్ల కథలంటే ఎప్పడూ ఆసక్తి కరమే. అది వెండి తెరపై కావచ్చు. బుల్లి తెరపై కావచ్చు. ఇప్పటికే ఇటువంటి కథలతో వచ్చిన సినిమాలు ప్రేక్షక్షుల్ని అమితంగా ఆకర్షించడమే కాకుండా, బుల్లి తెరను కూడా ఈ తరహా కథలు ఆకట్టుకుంటూనే ఉంటున్నాయి. తాజాగా సోనీ ఎంటర్ టైనమెంట్ టెలివిజన్ ' ఎన్ కౌంటర్' కార్యక్రమం పేరుతో శుక్రవారం నుంచి వీక్షకుల ముందుకు రానుంది. దీనికి బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎన్ కౌంటర్ కార్యక్రమంలో కనిపిస్తాయని మనోజ్ తెలిపారు. ముంబై నగరంలో పోలీసులకు, గ్యాంగ్ స్టర్లకు మధ్య జరిగిన పోరాట సన్నివేశాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నట్లు ఆయన స్ఫష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రతీ వారం ఒక గ్యాంగ్ స్టర్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.ఇక్కడ ఫలానా వారే చూడాలనే నియమాలు ఏమీ లేవని, ఏ వయసులో వారైనా ఎన్ కౌంటర్ కార్యక్రమాన్ని చూడవచ్చన్నారు.