ముంబై: ఎన్నికలపై బాలీవుడ్ నటీనటులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మార్పు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని తమ అభిమానులకు శనివారం విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని, అది మన ప్రాథమిక హక్కు అని మనోజ్ బాజ్‌పాయ్, ప్రీతీ జింతా, నిఖిల్ చిన్నప్ప తదితర నటులు సామాజిక వెబ్‌సైట్ ట్వీటర్‌లో ట్వీట్ చేశారు. మార్పు ప్రక్రియను ముందుగా ఆప్ ప్రారంభిస్తుందనే ఆశాభావాన్ని హన్సల్ మెహతా వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ ప్రజలందరూ ఈ రోజు ఓటు వేస్తారని ఆశిస్తున్నా. మీరు ఓటు వేసిన తర్వాత వేలిపై ఇంకు గుర్తు చూపిస్తూ సెల్ఫీ తీసుకుని ట్వీటర్‌లో పోస్టు చేయండి’ అని నిఖిల్ చిన్నప్ప అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయాలని మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు. ‘ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నా. ఇది జాతీయ రాజధాని నగరంలో నివసించే వారందరికీ ముఖ్యమైన రోజు’ అని ప్రీతి జింతా చెప్పారు. ‘అందరూ ఈ రోజు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఇప్పుడు ఓటు వేయకుండా తర్వాత రాష్ట్ర పాలన మీద ఫిర్యాదు చేయకండి’ అని శేఖర్ కపూర్ పేర్కొన్నారు.
ఓటుహక్కు వినియోగించుకోండి
Published Sat, Feb 7 2015 10:12 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement