Family Man Actor Manoj Bajpayee Mother Geeta Devi Passed Away - Sakshi
Sakshi News home page

Manoj Bajpayee: ప్రముఖ నటుడు మనోజ్‌ భాజ్‌పాయి ఇంట తీవ్ర విషాదం

Published Thu, Dec 8 2022 4:23 PM | Last Updated on Thu, Dec 8 2022 5:09 PM

Family Man Actor Manoj Bajpayee Mother Geeta Devi Passed Away - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, ఫ్యామిలీ మ్యాన్‌ ఫేం మనోజ్‌ భాజ్‌పాయి ఇంటి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాదేవి(80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.

కాగా గతేడాది ఆయన తండ్రి రాధాకాంత్‌ భాజ్‌పాయి మృతి చెందిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం నుంచి కోలుకోకముందే తాజాగా తల్లి కన్నుమూయడంతో మనోజ్‌ భాజ్‌పాయి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక గీతాదేవి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ బాలీవుడ్‌ నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. అలాగే మనోజ్‌ భాజ్‌పాయి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. 

తన తల్లి ప్రతి విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉండేదని.. తల్లిదండ్రులు అంటే తనకు ఎంతో ఇష్టమని మనోజ్‌ బాజ్‌పాయ్‌ పలు ఇంటర్వ్యూ చెబుతూ తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకునేవారు. కాగా మనోజ్‌ భాజ్‌పాయి ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అక్కినేని హీరో సుమంత్‌ నటించిన ప్రేమకథ చిత్రంతో ఆయన టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత హ్యాపీ, వేదం వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 

చదవండి: 
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్‌ సిరీస్‌ బ్యూటీ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..!
నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్‌ సునీత! ఆ స్టార్‌ హీరోకి అక్కగా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement