
బాలీవుడ్ నటుడు, ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఫేం మనోజ్ బాజ్‌పేయి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పేయి (83) ఆదివారం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. ఈ 52 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓటీటీల్లో విజయాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.