సినిమాలతో పోలిస్తే ఇప్పుడు ఓటీటీల జమానా నడుస్తోంది. కమర్షియల్ కథలన్నీ థియేటర్లలో రిలీజయ్యే మూవీస్‌గా వస్తున్నాయి. అలాంటివి కాకుండా థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, రియల్ స్టోరీలు మాత్రం ఓటీటీల్లో నేరుగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఓ రేంజులో అలరిస్తున్నాయి. ఇప్పడు అలానే దేశాన్ని వణికించిన ఓ సంఘటన ఆధారంగా వెబ్ సిరీస్ తీశారు. దాని టీజర్ రిలీజ్ చేయగా, అది అంచనాలు పెంచుతోంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 22 సినిమాలు)
భోపాల్ గ్యాస్ ట్రాజెడీపై
1984 డిసెంబరు 2న భోపాల్‌లో మిథైల్ ఐసో సైనేడ్ అనే రసాయనం గాలిలో కలవడం వల్ల వేలాది మంది చనిపోయారు. వందలాది మంది అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఆధారంగానే 'ద రైల్వే మెన్' అనే వెబ్ సిరీస్ తీశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించారు. నవంబరు 18 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని చెప్పారు. అలానే టీజర్ కూడా రిలీజ్ చేశారు.
టీజర్‌లో ఏముంది?
భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగిన టైంలో ఆ ఊరి రైల్వే స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్, ట్రైన్ నడిపే లోకో పైలైట్ సహా మరికొందరు వ్యక్తులు కలిసి ప్రజల్ని ప్రాణాల్ని కాపాడే ప్రయత్నమే 'ద రైల్వే మెన్' సిరీస్ స్టోరీ అని టీజర్ చూస్తే అర్థమైంది. స్టార్ హీరో మాధవన్, 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కేకే మేనన్, బబిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్ అయితే బాగుంది. మరి సిరీస్ ఎలా తీశారనేది చూడాలి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ 'మ్యాడ్' సినిమా.. స్ట్రీమిండ్ డేట్?)
Comments
Please login to add a commentAdd a comment