భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్‌ | Manisha Koirala Recalls Being Left Alone By Her Relatives And Friends After Being Diagnosed With Cancer | Sakshi
Sakshi News home page

Manisha Koirala: క్యాన్సర్‌ అని తెలియగానే అందరూ వదిలేశారు! ఒంటరి..

Published Sun, May 12 2024 10:59 AM | Last Updated on Sun, May 12 2024 12:57 PM

Manisha Koirala Recalls Being Left Alone by Her Relatives and Friends After being Diagnosed with Cancer

క్రిమినల్‌ మూవీతో తెలుగువారికి పరిచయమైంది మనీషా కొయిరాలా. ఒకే ఒక్కడు సినిమాలోని నెల్లూరి నెరజాణ.. పాటతో ప్రేక్షకులు విపరీతంగా నచ్చేసింది. తెలుగులో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ స్టార్‌‌ హీరోయిన్‌గా రాణించింది. కెరీర్‌ టాప్‌లో ఉన్న సమయంలో నేపాల్‌కు చెందిన సామ్రాట్‌ దహల్‌ను పెళ్లాడింది. పెళ్లయిన ఆరునెలలకే ఈ బంధం కొనసాగదని అర్థమైంది. ప్రేమంచిన భర్తే శత్రువుగా మారడంతో విడాకులు తీసుకోక తప్పలేదు.

తాగుడుకు బానిస
అప్పటికే బిజీ సినిమా షెడ్యూల్స్‌ వల్ల ఒత్తిడికి లోనై తాగుడుకు బానిసైంది. దీనికి తోడు విడాకులు తీసుకోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ బాధలు చాలదన్నట్లు 2012లో అండాశయ క్యాన్సర్‌ బారిన పడింది. అప్పటిదాకా తనతో కలిసిమెలిసి ఉన్న స్నేహితులు సైతం తమకు సంబంధం లేదన్నట్లు వదిలి వెళ్లిపోయారట.

ఒంటరిగా..
'జనాలకు ఎవరి బాధనూ పంచుకోవడం ఇష్టముండదు. కష్టాల్లో ఉన్నారనగానే వారిని ఒంటరిగా వదిలేసి పోతారు. స్నేహితులే కాదు నా బంధువులు కూడా ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నేనెలా ఉన్నాను? ఏంటనేది కూడా పట్టించుకోలేదు. నా పేరెంట్స్‌, సోదరుడు-వదిన.. వీళ్లు మాత్రమే సపోర్ట్‌గా నిలబడ్డారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బోధపడింది. 

అందుకే ఇంత స్ట్రాంగ్‌
అన్నింటినీ దాటుకుని వచ్చాను కాబట్టే ఈ రోజు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. కేవలం నా కుటుంబం వల్లే ఈరోజు ఇలా మీ ముందు నిలబడగలిగాను' అని చెప్పుకొచ్చింది. రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడిన మనీషా 2014లో ఆ భయంకరమైన వ్యాధిని జయించింది. ఇటీవల హీరామండి అనే వెబ్‌ సిరీస్‌లో మల్లికా జాన్‌ అనే పాత్రలో నటించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

చదవండి: నీలి రంగు చీరలో కేక పుట్టిస్తున్న కేరళ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement