
బాలీవుడ్ భామ, హీరామండి నటి సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ముంబయిలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా..కొన్నేళ్లుగా సోనాక్షి, జహీర్ డేటింగ్‌లో ఉన్నారు. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.
ఇటీవల సోనాక్షి సిన్హా బర్త్ డే సందర్భంగా ప్రియుడు జహీర్ ఇక్బాల్ విషెస్ తెలిపారు. ఇన్‌స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. వీరితో పాటు హీరామాండి నటీనటులను కూడా వివాహానికి ఆహ్వానించారు. కాగా.. సోనాక్షి సిన్హా చివరిసారిగా సంజయ్ లీలా భాన్సాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment