శృంగార సన్నివేశాలు చేసేసిన తర్వాత వాటి గురించి మాట్లాడటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ మధ్య మాత్రం పలువురు హీరోయిన్లు ఆయా సీన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. మొన్నామధ్య సోనాక్షి సిన్హా, దివ్య పిళ్లై ఇలా మాట్లాడారు. ఇప్పుడు యువ హీరోయిన్ శృతి శర్మ కూడా రొమాంటిక్ సీన్స్ వల్ల వచ్చిన కష్టనష్టాల్ని బయటపెట్టింది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. రీసెంట్‌గా 'హీరామండి' సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వాత్రంత్ర్యం రాకముందు పాకిస్థాన్‌లోని హీరామండి అనే వేశ్యవాటికని స్ఫూర్తిగా తీసుకుని ఈ సిరీస్ తీశాడు. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ తదితరులు నటించారు. 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' హీరోయిన్ శృతి శర్మ కూడా ఈ సిరీస్‌లో సైమా అనే పాత్ర చేసింది. నటిగా తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త)
'ఈ సిరీస్‌లో రజత్ కౌల్‌తో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేశాను. ఇందులో ఇద్దరం చాలా సహజంగా నటించాం. ఇలాంటి సన్నివేశాలు ఇప్పటివరకు చేయలేదు. అయితే ఇవి చేస్తున్నప్పుడు నా శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దుమ్ము, ధూళి ఉన్నప్పటికీ ఓ రోజంతా కష్టపడి ఈ సీన్స్ పూర్తి చేశాం. ప్రతిదీ ఫెర్ఫెక్ట్‌గా వచ్చేవరకు షూటింగ్ జరిగింది. అందుకే వెబ్ సిరీసులో ఈ సీన్లు చాలా అద్భుతంగా అనిపించాయి' అని శృతి శర్మ చెప్పింది.
అయితే సైమా పాత్ర చేయడం పట్ల సంతోషంగానే ఉన్నానని, భన్సాలీ ఊహించుకున్న రోల్ కోసం బాగానే కష్టపడ్డానని శృతి శర్మ చెప్పింది. ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ 'హీరామండి' వెబ్ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. అయితే కంటెంట్ కాస్త ల్యాగ్ ఉండటంతో తెలుగోళ్లకు పెద్దగా నచ్చలేదు కానీ హిందీ ఆడియెన్స్ మాత్రం బాగానే చూస్తున్నారు.
(ఇదీ చదవండి:పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)
Comments
Please login to add a commentAdd a comment