సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' సీజన్‌-2 ప్రకటన The second season of Sanjay Leela Bhansali's Heeramandi: The Diamond Bazaar has been announced. Sakshi
Sakshi News home page

సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' సీజన్‌-2 ప్రకటన

Jun 3 2024 11:59 AM | Updated on Jun 3 2024 1:32 PM

Heeramandi Web Series Season 2 Announced

'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ వెబ్‌ సిరీస్‌ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ పెద్ద సంచలనమే రేపింది. తెలుగులో కూడా అందుబాటులో ఉండటంతో ఇక్కడ కూడా మంచి ఆధరణే లభించింది.  కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి.  త్వరలో రెండో సీజన్‌ కూడా విడుదల కానుందని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు.

బాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో ప్రేక్షకులు కూడా హీరామండి పట్ల పెట్టుకున్న భారీ అంచనాలను ఆయన నిజం చేశారు. ఇందులో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి,షర్మిన్‌ సెగల్‌,సంజీదా షేక్‌ వంటి స్టార్స్‌ ఈ చిత్రంలో నటించి మెప్పించారు. 

ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ను తన సొంత నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో భన్సాలీ నిర్మించాడు. అయితే, 'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' సీజన్‌-1 సూపర్‌ హిట్‌ కావడంతో తాజాగా సీజన్‌ -2 ఉంటుందని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. త్వరలో విడుదల చేస్తామని సోషల్‌ మీడియా ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement