పద్మావత్‌ : సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌ | Supreme Court suspends ban orders on Padmaavat | Sakshi
Sakshi News home page

Jan 18 2018 12:03 PM | Updated on Sep 2 2018 5:18 PM

Supreme Court suspends ban orders on Padmaavat - Sakshi

పద్మావత్‌ చిత్ర విడుదలకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. నిషేధించిన రాష్ట్రాల్లో కూడా విడుదల చేయాల్సిందేనని గురువారం తేల్చి చెప్పింది.

సెన్సార్‌ సమస్యలను దాటి ఈ నెల 25న రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెన్సార్‌ బోర్డ్‌ రిలీజ్ కు అనుమతించినా.. తాము మాత్రం అనుమతించబోమని ఆయా ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. దీంతో నిషేదంపై చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కారణంగా సినిమాను నిషేదించారంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాపై విధించిన నిషేదాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సుప్రీం తీర‍్పుతో ఈ నెల 25న దేశవ్యాప్తంగా పద్మావత్‌ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement