
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం(ఏప్రిల్ 1) కీలక తీర్పు ఇచ్చింది. మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్‌లో హిందువులు ప్రార్థనలకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
అయితే మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్‌ను ఫైనల్‌గా జులైలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా,మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవచ్చని గతంలో వారణాసి జిల్లా కోర్టు తీర్పునివ్వగా ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా ధృవీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment