ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు | Netizens Praise Heeramandi Web Series On Netflix | Sakshi
Sakshi News home page

Heeramandi: ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు

Published Sat, May 4 2024 9:28 PM | Last Updated on Sat, May 4 2024 9:28 PM

Netizens Praise Heeramandi Web Series On Netflix

స్టార్ సంజయ్ లీలా భన్సాలీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'హీరామండి: డైమండ్ బజార్'. ప్రపంచవ్యాప్తంగా మే1న 190 దేశాల్లో రిలీజైంది. అలానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్రాండియర్ విషయంలో చాలామంది నెటిజన్స్.. ఈ సిరీస్‌ని అద్భుతమైన సిరీసుల్లో ఒకటిని అభిప్రాయపడుతున్నారు.

(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)

8 ఎపిసోడ్‌లతో తీసిన ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', ది క్రౌన్, బ్రేకింగ్ బ్యాడ్ లాంటి అంతర్జాతీయంగా సిరీస్‌లతో పోటీపడుతోంది. ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులు.. పలు టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వారి ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు.

ఉత్కంఠ భరితమైన విజువల్స్ నుంచి ఆకట్టుకునే కథల వరకు, ప్రతి ఫ్రేమ్ భన్సాలీ ప్రతిభకు నిదర్శనం. ఈ షోపై నెటిజన్లు ఎలా ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఇది ఒక అద్భుత కళాఖండం! నేను మంత్రముగ్ధుడయ్యాను. సంజయ్ లీలా భన్సాలీ మళ్లీ మాయ చేశాడు!", "కథ, నటన, దర్శకత్వం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సిరీస్ తప్పకుండా చూడండి!", "సంజయ్ లీలా బన్సాలీ మాస్టర్ స్టోరీ టెల్లర్. ఈ షో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది" అని రాసుకొస్తున్నారు.

(ఇదీ చదవండి: హీరామండి సిరీస్‌లో పెద్ద త‌ప్పులు.. ఇవి కూడా చూసుకోరా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement