తన తాజా సినిమా ’పద్మావతి’పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని ఆయన భరోసా ఇచ్చారు.