Alauddin Khilji
-
కాపురం గుట్టల్లో కాకతీయ స్థావరం
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కోటకు ఆవల కాకతీయుల సైనిక రహస్య స్థావరం ఉండేదా? గోదావరి తీరాన చిట్టడివిలో రెండవ ప్రతాపరుద్రుడు శత్రువు గుర్తించని వనదుర్గం కట్టాడా? కాకతీయుల సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి ఈ సైన్యంతోనే అల్లావుద్దీన్ ఖిల్జి సేనాని మాలిక్ కాఫర్‌పై దాడి చేశాడా?.. యువ చారిత్రక పరిశోధకుడు అరవింద్ ఆర్య పరిశోధనలు అవుననే సమాధానమిస్తున్నాయి. శత్రువుల రాకను ముందే పసిగట్టడానికి కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ పటిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కోసం నలువైపులా నిర్మించిన బురుజుల ఆధారాలు లభ్యమయ్యాయి. ముందే పసిగట్టేందుకు.. కాకతీయ సామ్రాజ్యంపై శత్రు రాజుల కన్నెప్పుడూ ఉండేది. ఢిల్లీ సుల్తాన్లు 5 సార్లు కాకతీయ సామ్రాజ్య ఆక్రమణకు దండెత్తారు. ఈ 5 మార్లు సుల్తాన్ల సైన్యం గోదావరి మీదుగానే ప్రయాణం చేసి ఓరుగల్లు రాజ్య ప్రవేశం చేసింది. దీంతో పరాయి సైన్యం రాకను ముందే పసిగట్టి నిలువరించేందుకు రెండవ ప్రతాప రుద్రుడు ఓరుగల్లు కోటకు ఉత్తర దిక్కున 140 కి.మీ దూరంలో కాపురం, వల్లూరు, ప్రతాపగిరి, నందిగామ గొంతెమ్మ గుట్టల మీద రహస్య స్థావరాలు ఏర్పాటు చేసిన చారిత్రక ఆనవాళ్లు వెలుగుచూశాయి. 200 మందికి పైగా సైనికులకు ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచేర్లకు 3 కిలోమీటర్ల దూరంలో కాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరికి కాస్త దూరంలో దట్టమైన అడవిలో మూడు కొండలు కనబడుతుంటాయి. శిల్పి పనిగట్టుకొని ఉలితో చెక్కిన తరహాలో ఈ గుట్టలున్నాయి. ఆ కొండల పైభాగంలో ఆలయం, సహజంగా ఏర్పడ్డ రాతి గోడ, ఆ పక్కనే మానవ నిర్మిత కోట గోడలు, బురుజులు, పెద్ద రాతి స్తంభాలు, కుండ పెంకులు లభ్యమయ్యాయి. వాన నీటి నిల్వ కోసం కొండ పైభాగంలో నాడు నిర్మించుకున్న బావుల లాంటి నిర్మాణాలు నేటి చెక్ డ్యాంలను తలపిస్తాయి. గుట్టల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాలు, సైనికుల నివాసానికి కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపున గుహలున్నాయి. రెండు కొండలను కలుపుతూ సుమారు 500 మీటర్ల మేర సహజ సిద్ధంగా ఏర్పాటైన రాతి గోడ ఉంది. ఈ రెండు గుహలలో 200 మందికి పైగా సైనికులు నివాసం ఉండేందుకు సరిపడేంత స్థలం గుర్తించారు. గరుడ విగ్రహం, సైనిక గుహ ముఖ భాగం మూడంచెల భద్రత రక్షణ కోసం కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెల్లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పటిష్టమైన రాతి గోడలు, సైనికుల పహారా కోసం నలువైపులా బురుజులు ఉన్నాయి. సైనికుల అవసరాల కోసం కొండ పైభాగంలో 1వ, 2వ కోటగోడల మధ్య రెండు చెక్ డ్యాంలను పోలి ఉన్న బావులు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడ నిర్మించుకున్నారు. సుల్తానులను నిలువరించడానికే కొండ మీద దొరికిన చారిత్రక ఆనవాళ్లు, అక్కడి చుట్టు పక్కల గ్రామాల్లోని జన బాహుళ్యం నుంచి సేకరించిన సాంస్కృతిక ఆనవాళ్ల ఆధారంగా ఇక్క డ కాకతీయుల రహస్య సైనిక స్థావరం ఉందనే అంచనాకు వచ్చాం. గోదావరి నది మీదుగా ఢిల్లీ సుల్తానులు పదే పదే దండెత్తుతుండటంతో కాకతీయులు దీనిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. – అరవింద్ ఆర్య పరికి, చరిత్ర యువ పరిశోధకుడు సైనిక స్థావరాలు ఉండొచ్చు కొండ మీద దొరికన ఆనవాళ్ల ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఉండొ చ్చని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతం గురించి సరైన చారిత్రక అవగాహన లేదు. చారిత్రక, సాంస్కృతిక, అజ్ఞాత చరిత్ర ఇక్కడ దాగి ఉంది. పురావస్తు శాఖ అధికారులు పూర్తిగా పరిశోధన చేసి ఈ ప్రాంత చరిత్ర, కట్టడాలను వెలుగులోకి తీసుకురావాలి. – ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు -
‘‘నా మతాన్ని కోల్పోతున్నా..!’’
సంజయ్ లీలా భన్సాలీ తాజాగా రూపొందించిన పద్మావతి చిత్రం.. విడుదలకు ముందే అనేక వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై హిందూవాదులు, రాజపుత్రులు ఇప్పటికే అనేక విమర్శలు చేశారు. రాజకీయ నాయకులు, సమాజంలోని కొందరు ప్రముఖ వ్యక్తులు ఈ చిత్రంపై తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించిన రణ్వీర్ సింగ్.. ట్విటర్లో మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ హెయిర్ స్టయిల్‌తో ఉన్నఫొటోను పెట్టి.. ’’నేను నా మతాన్ని కోల్పోతున్నాను‘‘ అంటూ రణ్వీర్ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. కొందరైతే.. అదీ మంచిదేలే అంటూ కామెంట్ చేయగా.. కొందరు మాత్రం కళాకారులకు మతం అంటూ ఏదీ ఉండదు అంటూ రీ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో రణ్వీర్ చేసిన ట్వీట్‌పై మాటల యుద్ధం కొనసాగుతోంది. Losing my religion A post shared by Ranveer Singh (@ranveersingh) on Nov 9, 2017 at 9:06pm PST Losing my religion pic.twitter.com/vYM68pz5nr — Ranveer Singh (@RanveerOfficial) November 10, 2017 -
ఎంతో కష్టపడి తీశాను.. ఆ రూమర్స్ నమ్మకండి!
-
ఎంతో కష్టపడి తీశాను.. ఆ రూమర్స్ నమ్మకండి!
తన తాజా సినిమా ’పద్మావతి’పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని ఆయన భరోసా ఇచ్చారు. ’ ఎంతో నిజాయితీతో, బాధ్యతతో, అకుంఠిత దీక్షతో ఈ సినిమాను తెరకెక్కించాను. రాణి పద్మావతి కథ నాలో ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఆమె వీరోచిత పోరాటం, త్యాగానికి ఘననివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించాను. కొన్ని వందతుల వల్ల ఈ సినిమాపై వివాదం తలెత్తింది’ అని భన్సాలీ పేర్కొన్నారు. ’రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య డ్రీమ్‌సీక్వెన్స్ సినిమాలో ఉన్నట్టు వచ్చిన వదంతులను నేను ఇప్పటికే ఖండించాను. వారిద్దరి మధ్య అలాంటి సన్నివేశాలు ఉండవని రాతపూర్వకంగా హామీ ఇచ్చాను. ఈ వీడియో ద్వారా నేను మరోసారి స్పష్టం చేస్తున్నా.. ఎవరి మనోభావాలు దెబ్బతీసేవిధంగా రాణి పద్మావతి, ఖిల్జీ మధ్య సన్నివేశాలు ఉండబోవు’ అని భన్సాలీ తెలిపారు. ఈ మేరకు పద్మావతి సినిమా అధికారిక ట్విట్టర్ పేజీలో ఆయన ఒక వీడియోను పోస్టు చేశారు. రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించేలా భన్సాలీ ఈ సినిమా తీశారంటూ రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సైతం ఈ సినిమాకు వ్యతిరేకంగా గొంతెత్తుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ)కి లేఖ రాయాలని బీజేపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. క్షత్రియ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని ఆరోపణలు వస్తున్నాయని, రాణి పద్మావతికి, దురాక్రమణకు దిగిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్య లింక్స్ ఉన్నట్టు ఈ సినిమాలో చరిత్ర వక్రీకరించారని ఆరోపణలు వినిపిస్తుండటంతో వివాదం ముదురుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతోపాటు రాజ్‌పుత్ వర్గంవారు ఈ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ఖిల్జీకి ఫిదా!
భుజాలపైకి జారిన జుత్తు, ఎడమ కంటి కింద రెండు కత్తి గాట్లు, భయపెట్టే ముఖ తేజస్సుతో విలన్‌కి చిరునామా అనేలా రణవీర్ సింగ్ లుక్ రిలీజైంది. దీపికా పదుకొనె, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ ముఖ్య తారలుగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పద్మావతి’. రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణవీర్ ఇందులో సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషిస్తున్నారు. ఈ రోల్‌కు సంబంధించిన రెండు లుక్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లుక్స్‌ను చూసిన అభిమానులు ఖిల్జీకి ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఖతర్నాక్ సుల్తాన్!! అల్లావుద్దీన్ ఖిల్జీ.. డెడ్లీ ఫస్ట్‌లుక్!
సాక్షి, హైదరాబాద్: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ' ఫస్ట్‌లుక్ రిలీజైంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీగా భయానక డెడ్లీలుక్తో అదరగొట్టాడు. పొడవైన శిరోజాలు, భీకరమైన కంటిచూపు, ముఖంపై కత్తిగాటుతో ఖిల్జీ ఫస్ట్‌లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిస్తున్న 'పద్మావతి'లో సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తుండగా.. పద్మావతిగా దీపికా పదుకొనే, మహారాజ రావల్ రతన్‌సింగ్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పద్మావతి, రతన్‌సింగ్ ఫస్ట్లుక్స్కు ఆన్లైన్లో విశేషమైన స్పందన లభించింది. బన్సాలీ మార్క్ పర్ఫెక్షన్, గ్రాండ్‌నెస్.. ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఖిల్జీ ఫస్ట్‌లుక్‌పై నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఖతర్నాక్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. SULTAN ALAUDDIN KHILJI #Khilji pic.twitter.com/Ls2IznAq1c — Ranveer Singh (@RanveerOfficial) 2 October 2017 SULTAN ALAUDDIN KHILJI #Khilji pic.twitter.com/DNtht5bHcQ — Ranveer Singh (@RanveerOfficial) 2 October 2017 -
పద్మావతి ఎవరు..?
-
పద్మావతి ఎవరు..?
న్యూఢిల్లీ: ‘పద్మావతి’ బాలివుడ్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై రాజ్‌పుత్ కర్ణి సేన కార్యకర్తలు దాడి జరపడంపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వారెందుకు దాడి చేశారు? అసలు పద్మావతి ఎవరు? ఆమెపై బన్సాలీ తీస్తున్న సినిమా ఏమిటీ? అది చారిత్రక సినిమానా, చరిత్రను వక్రీకరించే సినిమానా? అసలు వివాదం ఏమిటీ? నిజానికి సమస్త చరిత్రలు సైతం వివాదాస్పదమే. చరిత్రలో నిలిచిపోయేటివి ఎక్కువగా విజేతలు రాసిన లేదా రాయించిన చరిత్రలవడమే అందుకు కారణం. రాజ్‌పుత్ రాజకుటుంబానికి చెందిన ‘పద్మావతి’ క్యారెక్టర్ కేవలం కల్పిత గాధనేది మెజారిటీ చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకం 13–14 శతాబ్దానికి చెందిన శక్తివంతమైన ముస్లిం రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ, చిత్తార్ నేటి చిత్తార్‌గఢ్ రాజు రావల్ రతన్ సింగ్ భార్య పద్మావతి అందచందాల గురించి కథకథలుగా విని ఆమెను మోహిస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసమే 1303లో చిత్తార్‌గఢ్ రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు. తన భర్తతో సహా తన రాజకుటుంబీకులు మరణించారన్న వార్త తెలిసి, తోటి అంత:పుర స్త్రీలతో కలసి రాణి పద్మావతి సామూహిక ఆత్మాహుతికి (నాడు సతి, జవహర్‌గా వ్యవహరించేవారు) పాల్పడుతుంది. పద్మావతి తెల్సిందిలా... ఈ కథ ముహమ్మద్ జయసీ 1540లో రాసిన కవిత్వం ద్వారా మొదటి సారి ప్రపంచానికి తెల్సింది. ఆ తర్వాత ఆమె గీతా చిత్రాలు కూడా వెలువడ్డాయి. రమ్య శ్రీనివాస్ రాసిన ‘ది మెనీ లైవ్స్ ఆఫ్ రాజ్‌పుత్ క్వీన్: హిరాయిక్ పార్ట్స్ ఆఫ్ ఇండియా’ అన్న పుస్తకంలో కూడా పద్మావతి గురించి కొంత ప్రస్తావన ఉంటుంది. అయితే పద్మావతి కథ నిజమైనదనడానికి చారిత్రక ఆధారాలేవి దొరకలేదు. ఖిల్జీ లాంటి ముస్లిం రాజును దిక్కరించిన ధీరవనితగా ఆమె కథ మాత్రం ప్రచారంలో ఉంది. రాజ్‌పుత్‌లు బయటి కులాల వారికి పిల్లనివ్వరు, తెచ్చుకోరు. ఆ కుల కట్టుబాటుకు కట్టుబడే పద్మావతి సామూహిక ఆత్మాహుతికి పాల్పడిందన్నది రాజ్‌పుత్‌ల విశ్వాసం. తెగింపు, ధైర్య సాహసాలకు రాజ్‌పుత్‌లు మారుపేరని ‘అమర్ చిత్ర కథలు’ కూడా తెలియజేస్తాయి. అయినా మొగల్ రాజులకు లొంగారు... కాలమాన పరిణామాల్లో రాజ్‌పుత్‌లు కూడా మొగల్స్ రాజులకు లొంగిపోవాల్సి వచ్చింది. అక్బర్ నుంచి ఫారుక్సియర్, అంటే మధ్య 16వ శతాబ్దం నుంచి 18 శతాబ్దం వరకు వారు ఆడ పిల్లలను మొగల్ రాజులకు ఇచ్చారు. వారిచేత మామలు, బావలు అని పిలిపించుకున్నారు. మొగల్ చక్రవర్తులకు వియ్యంకులవడం ద్వారా తమ రాజ్యాలను రక్షించుకోవడమే కాకుండా ఇతర రాజులు తమమై దాడులు జరపకుండా కొంత కాలం నివారించుకోకలిగారు. చరిత్ర గమనంలో రాజ్‌పుత్‌లు టర్కీలు, మొగల్స్ రాజులే కాకుండా మరాఠీలు, పిండారీలు చేతుల్లో కూడా ఓడిపోయారు. ఎలాంటి యుద్ధం చేయకుండానే బ్రిటీష్ పాలకులకు లొంగిపోయారు. అయితే ముస్లింల రాజులకు లొంగకుంగా నిలబడింది తామేనని వారు చెప్పుకుంటారు. పద్మావతంటే బన్సాలీకి ఎంతో ఇష్టం.... సంజయ్ లీలా బన్సాలీకి పద్మావతి కథంటే చచ్చేంత ఇష్టం. అందుకే ఆయన 2008లో పారిస్‌లోని ‘డూ చాట్లెట్’ థియేటర్లో ప్రదర్శించిన ఒపేరాకు దర్శకత్వం వహించారు. పద్మావతిపై 1923లో ప్రెంచ్ కంపోజర్ ఆల్బర్ట్ రసెల్ రూపొందిచన ఒపెరాను బన్సాలీ దర్శకత్వం వహించి తనదైన శైలిలో ప్రదర్శించారు. 2002లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్లో బన్సాలీ తీసిన ‘దేవదాస్’ చిత్రాన్ని చూసి ముగ్ధుడైన పారిస్ ఒపేరా థియేటర్ యజమాని జీన్ లక్ చాప్లిన్ ఆహ్వానం మేరకు బన్సాలీ తొలిసారిగా ఒపేరాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. కరీనా కపూర్‌తో తీయాలకున్న బన్సాలీ... స్థానిక నటీనటులతో పారిస్‌లో ప్రదర్శించిన పద్మావతి ఒపేరాకు మంచి పేరు రావడంతో నాడే హిందీలో పద్మావతి సినిమాను తీయాలనుకున్నారు బన్సాలీ. కరీనా కపూర్‌ను పద్మావతిగా పరిచయం చేయాలనుకున్నారు. గుజారిష్ లాంటి చారిత్రక సినిమాలు బాక్సాఫీసు వద్ద పల్టీకట్టడంతో సినిమాను వాయిదా వేసుకున్నారు. బాజీరావు మస్తాని, గోలియోంకి రాస్లీలా–రామ్‌లీలా సినిమాలు హిట్టవడంతో పద్మావతిని కూడా తెరపైకి ఎక్కించాలనుకున్నారు. చిత్ర నిర్మాణాన్ని ముగించి వచ్చే నవంబర్ 17వ తేదీన విడుదల చేయాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే పద్మావతిపై చిత్రాలు... పద్మావతిపై జస్వంత్ జావరి 1961లో జై చితోడ్ను, మహారాణి పద్మావతి సినిమాను 1964లో తీసి విడుదల చేశారు. పద్మావతిపై మొహమ్మద్ జయసీ రాసిన కవిత్వాన్నే జై చితోడ్లో పాటలుగా ఉపయోగించారు. తొలి చిత్రంలో పద్మావతిగా నిరుపమా రాయ్ నటించగా, తర్వాత చిత్రంలో అనితా గుహ నటించారు. పద్మావతిగా వైజయంతిమాల, ఖిల్జీగా శివాజీ గణేష్ నటించిన ‘చిత్తోర్ రాణి పద్మిణి’ అనే తమిళ చిత్రం 1963లో విడుదలైంది. దీనికి చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. అంతకుముందు 2009లో ‘చిత్తోడ్కీ రాణి పద్మినీ కా జోహుర్’ పేరుతో సోనీ టీవీలో సీరియల్ కూడా వచ్చింది. తమిళ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్‌కాగా, జస్వంత్ జావరి దర్శకత్వం వహించిన మహారాణి పద్మావతి సక్సెస్ అయింది. అప్పుడు ప్రభుత్వం సహకరించింది... జస్వంత్ జావరి తీసిన ‘మహారాణి పద్మావతి’ చిత్రానికి నాడు రాజస్థాన్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. రాజ్‌పుత్‌ల ధైర్య సాహసాలను, తెగింపుకు ఆ సినిమా అద్దం పట్టిదంటూ రాజ్‌పుత్‌లు కూడా సినిమాను ఎంతో ఆదరించారు. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ‘జోద్ అక్బర్’లో కూడా చరిత్రను వక్రీకరించారని, పద్మావతిలో కూడా బన్సాలీ చరిత్రను వక్రీకరిస్తారన్నది రాజ్‌పుత్‌ల అనుమానం. అందుబాటులోవున్న చరిత్ర ప్రకారం పద్మావతి, ఖిల్జీలు ఒకరినొకరు చూసుకోరు. మహారాణి పద్మావతి సినిమాలో మాత్రం చివరలో పద్మావతిని చూసి ఆమె అందానికి ఖిల్జీ మరింత ముగ్ధుడవుతారు. ఇలాంటి కథల మధ్య ఖిల్జీలు, పద్మావతి కలలో కలసుకొని పాటలు పాడుకున్నట్లు బన్సీలీ సినిమా తీస్తున్నారన్నది రాజ్‌పుత్‌ల అనుమానం. అందుకే దాడి చేశారు. అసలు బాధ వేరేనేమో..... ఖిల్జీ, పద్మావతి మధ్య ఎలాంటి డ్రీమ్ సీక్వెన్సీలు లేవంటూ బన్సాలీ బహిరంగంగా ప్రకటించారు. పైగా తాను తీస్తున్నది విషాదాంత చిత్రం కాదని, రాజ్‌పుత్‌లకు చెందిన ఓ ధీరవనిత మనోధైర్యాన్ని స్ఫూర్తిగా చూపిస్తున్నానని చెప్పారు. ‘నేను చనిపోయేంత పిరికిదాన్ని కాదు. నేను శత్రువలకు చిక్కకుండా మంటల్లోకి నడిచిపోయే మరింత ధైర్యం కావాలి. రాజ్‌పుత్‌ల పరువు, ప్రతిష్టలు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోవాలి’ అంటూ పద్మావతి అగ్నికి ఆహుతవుతూ చెప్పేమాటలను కూడా కొన్నేళ్ల క్రితమే ఒపేరా ప్రదర్శన సందర్భంలో బన్సాలీ వినిపించడం ఆయన స్ఫూర్తిని తెలియజేస్తోంది. చరిత్రలో పద్మావతి ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆమెపై చిత్రం తీస్తే రాజ్‌పుత్‌ల పరువు ఎందుకు పోతుందో అర్థం కాదు. వారి పేరుతో వచ్చిన రాజస్థాన్ ఉన్నంతకాలం చరిత్రలో వారు మిగిలే ఉంటుంది కదా, ముస్లిం రాజుల చేతుల్లో ఓడిపోయామన్న బాధ! -
బన్సాలీ సినిమాగా మరో చారిత్రక ప్రేమకథ
రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా విషాదాంత ప్రేమకథలను భారీగా తెరకెక్కించే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. దేవదాస్, రామ్ లీలా లాంటి ప్రేమకథలను తెరకెక్కించిన బన్సాలీ తన తాజా చిత్రం బాజీరావ్ మస్థానీతో జాతీయ అవార్డును సైతం సాధించాడు. తన ప్రతీ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే బన్సాలీ మరో చారిత్రక ప్రేమకథకు వెండితెర రూపం ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు బన్సాలీ. 1296 నుంచి 1316 మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీ, మేవార్ రాణి పద్మావతిని ప్రేమించాడు. ఈ ప్రేమకథనే నెక్ట్స్ సినిమాకు కథగా తీసుకున్నాడు బన్సాలీ. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయడనికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటుల ఎంపిక జరగనుంది.