సంజయ్ లీలా భన్సాలీ తాజాగా రూపొందించిన పద్మావతి చిత్రం.. విడుదలకు ముందే అనేక వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై హిందూవాదులు, రాజపుత్రులు ఇప్పటికే అనేక విమర్శలు చేశారు. రాజకీయ నాయకులు, సమాజంలోని కొందరు ప్రముఖ వ్యక్తులు ఈ చిత్రంపై తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించిన రణ్‌వీర్ సింగ్.. ట్విటర్‌లో మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
అల్లావుద్దీన్ ఖిల్జీ హెయిర్ స్టయిల్‌తో ఉన్నఫొటోను పెట్టి.. ’’నేను నా మతాన్ని కోల్పోతున్నాను‘‘ అంటూ రణ్‌వీర్ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. కొందరైతే.. అదీ మంచిదేలే అంటూ కామెంట్ చేయగా.. కొందరు మాత్రం కళాకారులకు మతం అంటూ ఏదీ ఉండదు అంటూ రీ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో రణ్‌వీర్ చేసిన ట్వీట్‌పై మాటల యుద్ధం కొనసాగుతోంది.
Losing my religion pic.twitter.com/vYM68pz5nr
— Ranveer Singh (@RanveerOfficial) November 10, 2017
Comments
Please login to add a commentAdd a comment