
సాక్షి, హైదరాబాద్: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ' ఫస్ట్‌లుక్ రిలీజైంది. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీగా భయానక డెడ్లీలుక్‌తో అదరగొట్టాడు. పొడవైన శిరోజాలు, భీకరమైన కంటిచూపు, ముఖంపై కత్తిగాటుతో ఖిల్జీ ఫస్ట్‌లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిస్తున్న 'పద్మావతి'లో సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటిస్తుండగా.. పద్మావతిగా దీపికా పదుకొనే, మహారాజ రావల్ రతన్‌సింగ్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పద్మావతి, రతన్‌సింగ్ ఫస్ట్‌లుక్స్‌కు ఆన్‌లైన్‌లో విశేషమైన స్పందన లభించింది. బన్సాలీ మార్క్ పర్ఫెక్షన్, గ్రాండ్‌నెస్.. ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఖిల్జీ ఫస్ట్‌లుక్‌పై నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఖతర్నాక్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
SULTAN ALAUDDIN KHILJI #Khilji pic.twitter.com/Ls2IznAq1c
— Ranveer Singh (@RanveerOfficial) 2 October 2017
SULTAN ALAUDDIN KHILJI #Khilji pic.twitter.com/DNtht5bHcQ
— Ranveer Singh (@RanveerOfficial) 2 October 2017