
భుజాలపైకి జారిన జుత్తు, ఎడమ కంటి కింద రెండు కత్తి గాట్లు, భయపెట్టే ముఖ తేజస్సుతో విలన్‌కి చిరునామా అనేలా రణవీర్ సింగ్ లుక్ రిలీజైంది. దీపికా పదుకొనె, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ ముఖ్య తారలుగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పద్మావతి’. రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రణవీర్ ఇందులో సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషిస్తున్నారు. ఈ రోల్‌కు సంబంధించిన రెండు లుక్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లుక్స్‌ను చూసిన అభిమానులు ఖిల్జీకి ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment