దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న పద్మావతి సినిమా యూనిట్ పై మరోసారి దాడి జరిగింది. ప్రస్తుతం కొల్హాపూర్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్ లో పద్మావతి చిత్ర షూటింగ్ జరుగుతోంది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి సెట్ ను తగలబెట్టారు. అదే సమయంలో లొకేషన్ లోఉన్న వాహనాలు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే ఈ దాడి అర్ధరాత్రి సమయంలో జరగటంతో యూనిట్ సభ్యులెవరు అక్కడ లేరు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.