![Ranbir Kapoor Says Sanjay Leela Bhansali Would Hit Abuse Him During Black Movie Shooting - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/15/Ranbir-kapoor4.jpg.webp?itok=C-OiQ3fh)
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన బ్లాక్ సినిమాకు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే భన్సాలీతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టడం, అది కూడా అనుకున్నంత సులుభంగా ముందుకు సాగలేదని తెలిపాడు రణ్‌బీర్. తాజాగా ‘‘రాజ్ కపూర్: ద మాస్టర్ ఎట్ వర్క్ ’’ పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రణ్‌బీర్ గతంలో సంజయ్‌తో పని చేసిన తన అనుభవాలను పంచుకున్నాడు.
ఈ ఈవెంట్‌లో రణ్‌ధీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘‘నేటితరం డైరెక్టర్లు కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యతని ఇస్తున్నారు. రాజ్ కపూర్ శకం నాటి సినిమాలు ముగిశాయని అన్నారు. డబ్బు కోసం అతడు ఎన్నడూ పనిచేయలేదు. బాబీ సినిమాలో నటించినందుకు ఒక పెయింటింగ్‌ను మాత్రమే ఇచ్చారని అన్నాడు. రణ్‌ధీర వ్యాఖ్యలకు కొంత భాగం సమర్థించిన రణ్బీర్ కపూర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ప్రస్తుత దర్శకులు పూర్తిగా కమర్షిమల్ చిత్రాలకే మొగ్గుచూపుతున్నాంటే తాను నమ్మనని చెప్పాడు.
గతంలో బ్లాక్ సినిమా కోసం భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేటప్పుడు తాను అనేక గంటల పాటు మోకళ్లపై కూర్చునే వాడని చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి భన్సాలీ తనని తిట్టేవాడని, మరి కోపం ఎక్కువైతే కొట్టేవాడని కూడా అప్పటి విషయాలని గుర్తుచేసుకున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీలోనే అలాంటి ఘటనలు తనకు ఎదురుకావడం బయట ప్రపంచాన్ని ఎదర్కునేలా తనని సిద్ధం చేసిందని రణ్ బీర్ చెప్పాడు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది.
చదవండి: Sara Ali Khan: ‘చాల తప్పులు చేశా, కొన్ని పబ్లిక్‌గానే జరిగాయి’
Comments
Please login to add a commentAdd a comment