
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివతో ‘ఎన్టీఆర్ 30’, ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్‌ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కాస్తా బ్రేక్ తీసుకుంటున్నాడు. విరామం అనంతరం డిసెంబర్‌లో కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో దివ్య భారతిని మైమరిపించారు
దీని తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రాన్ని కూడా ప్రారంభిస్తాడట. ఈ క్రమంలో ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ బడా దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీ-టౌన్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.
చదవండి: అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: రీతూ వర్మ
ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ఈ తాజా బజ్ ప్రకారం సంజయ్ లీలా భన్సాలీ, ఎన్టీఆర్ కోసం పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేగాక దీనికి ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. అన్నీ కుదిరి భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్‌కు పండగే. దీంతో భన్సాలీతో, ఎన్టీఆర్ చిత్రం అంటే.. దీనికంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదంటూ ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. మరీ ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి వస్తుందా? లేదా? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
చదవండి: రజనీకాంత్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన కూతురు సౌందర్య
Comments
Please login to add a commentAdd a comment