
రాణి పద్మావతి ఫస్ట్‌లుక్!
ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చారిత్రక సినిమా 'రాణి పద్మావతి'. మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో దీపికా పదుకొనే నటించింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గురువారం ఉదయం విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో రాణిపద్మావతిగా దీపికా పదుకొనే అదరగొట్టింది. రాజస్థానీ రాచరిక ఆహార్యంతో.. రాజసం, ధీరత్వం, దృఢనిశ్చయం గల రాణిగా దీపిక ఈ ఫస్ట్‌లుక్‌లో ఆకట్టుకుంటోంది.
బన్సాలీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ సినిమా చుట్టూ పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. రాజ్‌పుత్ వంశానికి చెందిన పద్మావతిని తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ కొన్ని గ్రూపులు షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా యూనిట్‌పై దాడి చేశాయి. ఎన్ని వివాదాలు ఎదురైనా వెనుకకు తగ్గని బన్సాలీ తాను అనుకున్న రీతిలో సినిమాను తెరకెక్కించారు. దుర్గానవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా దీపికా పదుకొనే 'రాణి పద్మావతి' ఫస్ట్‌లుక్ ఫొటోలను తన ట్విట్టర్ పేజీలో పోస్టుచేశారు. ఈ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటిస్తుండగా.. పద్మావతి భర్త రాజా రతన్‌సింగ్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.
#Padmavati @FilmPadmavati pic.twitter.com/MenI9N7qFz
— Deepika Padukone (@deepikapadukone) September 21, 2017
देवी स्थापना के शुभ अवसर पर मिलिए रानी पद्मावती से #Padmavati @FilmPadmavati pic.twitter.com/hYJonZCEEH
— Deepika Padukone (@deepikapadukone) September 21, 2017