
ప్రతీ రంజాన్ పండుగకు ఓ సినిమాను రిలీజ్ చేసి అభిమానులకు కానుకగా ఇస్తున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. గత రెండు చిత్రాలతో (రేస్3, ట్యూబ్‌లైట్) అభిమానులను నిరాశపరిచిన సల్లూ భాయ్.. ఈసారి ‘భారత్’గా అభిమానుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. టాక్ పరంగా ఎలా ఉన్నా.. మొదటి రోజు మాత్రం రికార్డులు సృష్టించింది. కంటెంట్‌తో పనిలేకుండా.. కేవలం సల్మాన్ చరిష్మాతో సినిమాలు ఆడుతాయని మళ్లీ ‘భారత్’తో నిరూపించాడు.
సల్మాన్ వచ్చే ఏడాది ఈద్‌కు కూడా మరో ప్రాజెక్ట్‌ను(ఇన్షా అల్లా) సిద్దం చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఇరవై యేళ్ల తరువాత మళ్లీ కలుస్తున్నానని ట్విటర్ వేదికగా తెలిపారు. 1999 లో వచ్చిన హమ్ దిల్ దే చుకే సనమ్ అనే చిత్రం కోసం సల్మాన్, సంజయ్ లీలా భన్సాలీ కలిసి పని చేశారు. 20 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ రానుండడంతో అభిమానులలో ఇప్పటినుంచే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అలియాభట్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది.
Eid 2020 will be super mubarak! Inshallah, my first film with Salman and Sanjay Leela Bhansali, will release that day. @bhansali_produc @BeingSalmanKhan @prerna982 #Inshallah pic.twitter.com/jJ21nFpazI
— Alia Bhatt (@aliaa08) June 6, 2019