
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బయోపిక్‌కు సంబంధించిన ప్రకటన ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొదించనున్నారు. అయితే తొలి ప్రకటనతోనే సినిమాపై అంచనాలు పెంచేందుకు తొలి పోస్టర్‌ను ఓ ప్యాన్ ఇండియా స్టార్‌తో రిలీజ్ చేయించాలనుకున్న బన్సాలీ, ఆ బాధ్యతను బాహుబలి ప్రభాస్‌కు అప్పగించారు.
బాహుబలి, సాహో సినిమాలతో జాతీయ స్థాయిలో తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకున్న ప్రభాస్, తన సోషల్ మీడియా పేజ్ ద్వారా మోదీ బయోపిక్ ‘మన్ బైరాగి’ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. తెలుగు పోస్టర్‌ను ప్రభాస్‌రిలీజ్ చేయగా హిందీ పోస్టర్‌ను అక్షయ్ కుమార్ విడుదల చేశారు. సంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహావీర్ జైన్‌తో కలిసి సంజయ్ నిర్మిస్తున్నారు.