బ్రహ్మాండంగా ఉంటుంది! - దాసరి కిరణ్ | Havish will definitely become a mass hero : Dasari Kiran | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండంగా ఉంటుంది! - దాసరి కిరణ్

Published Wed, Feb 4 2015 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

బ్రహ్మాండంగా ఉంటుంది! - దాసరి కిరణ్

బ్రహ్మాండంగా ఉంటుంది! - దాసరి కిరణ్

 ‘‘మా గత చిత్రం ‘జీనియస్’కన్నా ఈ చిత్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా నిర్మించాం. శ్రీపురం కిరణ్ దర్శకుడు కావాలని చాన్నాళ్లుగా కృషి చేస్తున్నాడు. ఈ చిత్రం ఆ కలను నెరవేర్చడమే కాదు... దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. నటీనటులందరూ తమ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. మలేసియా నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఈ నెల 7న పాటలను, 20న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దాసరి కిరణ్‌కుమార్ చెప్పారు.

కోనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. హవీష్, అభిజిత్, నందిత, అక్ష హీరో హీరోయిన్లు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ చిత్రకథ చాలా కొత్తగా ఉంటుందని లంకాల బుచ్చిరెడ్డి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రజనీకాంత్ నటించిన ‘నరసింహ’ చిత్రానికి పని చేసిన 20 మంది ఘోస్ట్ రైటర్స్‌లో నేనూ ఒకణ్ణి.

ఆ చిత్రంతో నా కెరీర్ ప్రారంభమైంది. రాఘవేంద్రరావుగారు ‘గంగోత్రి’ సినిమా చేస్తున్న సమయంలో ఆయన్ను కలిసి, ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన చేతుల మీదగా నా తొలి చిత్రం టీజర్ ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. పధ్నాలుగా మంది కొత్త దర్శకుల చిత్రాలకు ఎస్. గోపాల్‌రెడ్డిగారు ఛాయాగ్రహణం చేశారు. నేను పదిహేనో దర్శకుణ్ణి. ఈ చిత్రానికి అవకాశం ఇచ్చిన కిరణ్‌కుమార్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. పలు చిత్రాలకు రచయితగా వ్యవహరించాననీ, ఈ చిత్రానికి  పూర్తి స్థాయి సంభాషణల రచయితగా చేశానని విస్సు చెప్పారు. ఈ వేడుకలో సహనిర్మాత ముత్యాల రమేశ్, ఎస్. గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement