Dasari Kiran
-
వ్యూహం..
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. ‘‘అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ‘వ్యూహం’ రూపొందుతోంది. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
వర్మను వెంటాడుతున్న వంగవీటి వివాదం
-
వర్మను వెంటాడుతున్న వంగవీటి వివాదం
వంగవీటి చిత్రంతో విజయవాడ రౌడీయిజాన్ని మరోసారి తెరమీదకు తెచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై వంగవీటి రాధ విజయవాడ క్రిమినల్ కోర్టులో కేసు వేశారు. వంగవీటి కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను తెరకెక్కించారని, సినిమా కారణంగా తమ పరవుపోయిందని వంగవీటి రాధ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విజయవాడ క్రిమినల్ కోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్‌పై కేసు వేశారు. తమ పేరును సినిమా టైటిల్ గా పెట్టి తమ పరువు తీశారని, సినిమాలో తమ కుటుంబానికి సంబంధం లేని అంశాలను చిత్రీకరించారని పేర్కోన్నారు. సినిమా రిలీజ్‌కు ముందు వంగవీటి, దేవినేని కుటుంబాలను సంప్రదించిన వర్మ వారు చెప్పిన అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేశారు. రిలీజ్ సమయంలోనూ వంగవీటి వివాదాలకు కారణమయ్యింది. వంగవీటి రాధ, రత్నకుమారిలను కలిసిన వర్మ, చర్చలు ఫలించకపోవటంతో.. నన్ను చాలా పద్దతిగా బెదిరించారంటూ ఆరోపించాడు. అదే సమయంలో తను విజయవాడ రౌడీయిజాన్ని చాలా దగ్గరగా చూశానని, రాధ కన్నా అప్పటి పరిస్థితులు తనకే బాగా తెలుసని ట్వీట్లు చేయటం అప్పట్లో వివాదాస్పదమయ్యింది. -
బ్రహ్మాండంగా ఉంటుంది! - దాసరి కిరణ్
‘‘మా గత చిత్రం ‘జీనియస్’కన్నా ఈ చిత్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా నిర్మించాం. శ్రీపురం కిరణ్ దర్శకుడు కావాలని చాన్నాళ్లుగా కృషి చేస్తున్నాడు. ఈ చిత్రం ఆ కలను నెరవేర్చడమే కాదు... దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. నటీనటులందరూ తమ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. మలేసియా నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఈ నెల 7న పాటలను, 20న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దాసరి కిరణ్‌కుమార్ చెప్పారు. కోనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. హవీష్, అభిజిత్, నందిత, అక్ష హీరో హీరోయిన్లు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ చిత్రకథ చాలా కొత్తగా ఉంటుందని లంకాల బుచ్చిరెడ్డి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రజనీకాంత్ నటించిన ‘నరసింహ’ చిత్రానికి పని చేసిన 20 మంది ఘోస్ట్ రైటర్స్‌లో నేనూ ఒకణ్ణి. ఆ చిత్రంతో నా కెరీర్ ప్రారంభమైంది. రాఘవేంద్రరావుగారు ‘గంగోత్రి’ సినిమా చేస్తున్న సమయంలో ఆయన్ను కలిసి, ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన చేతుల మీదగా నా తొలి చిత్రం టీజర్ ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. పధ్నాలుగా మంది కొత్త దర్శకుల చిత్రాలకు ఎస్. గోపాల్‌రెడ్డిగారు ఛాయాగ్రహణం చేశారు. నేను పదిహేనో దర్శకుణ్ణి. ఈ చిత్రానికి అవకాశం ఇచ్చిన కిరణ్‌కుమార్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. పలు చిత్రాలకు రచయితగా వ్యవహరించాననీ, ఈ చిత్రానికి పూర్తి స్థాయి సంభాషణల రచయితగా చేశానని విస్సు చెప్పారు. ఈ వేడుకలో సహనిర్మాత ముత్యాల రమేశ్, ఎస్. గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.