ఉత్తరప్రదేశ్ లో 'రామ్ లీలా'పై నిషేధం!
ఉత్తర ప్రదేశ్ లో 'రామ్ లీలా' ప్రదర్శనపై అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ నిషేధం విధించింది. మర్యాద పురుషోత్తం భగవాన్ రామ్ లీలా సమితి దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ అశోక్ పాల్ సింగ్, జస్టిస్ దేవి ప్రసాద్ సింగ్ లతో కూడిన బెంచ్ విచారించింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నవంబర్ 15 తేదిన విడుదలైన చిత్రంలో వివాదస్పద, అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయని, ఈ చిత్రానికి సెన్సార్ బోర్బు సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కోన్నారు. అంతేకాకుండా హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రానికి రామ్ లీలా పేరు పెట్టారని.. కావున ఈ చిత్రాన్ని నిషేధించాలని పిటిషనర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, సెన్సార్ బోర్డును, ఎరోస్ ఇంటర్నేషనల్, సంజయ్ లీలా భన్సాలీ లను పిటిషన్ లో పార్టీలను చేశారు.