హాట్ హాట్ గా ఆ ఇద్దరి వ్యవహారం!
ముంబై:
బాలీవుడ్ లో బెంగళూరు భామ దీపికా పదుకోనె, రాణ్ వీర్ సింగ్ ల మధ్య తెరమీదే కాకుండా బయటకూడా ప్రేమాయణం జోరుగానే సాగుతోందని ముంబై సినీ బజార్ లో రూమర్లు ఇటీవల కాలంలో జోరుగా షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఏ నోట విన్నా దీపికా, రణ్ వీర్ ల హల్ చల్ గురించేనని మీడియా కోడైకూస్తోంది.
వీరిద్దరూ కలిసి సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల దీపికా, రణ్ వీర్ లపై హాట్ హాట్ గా లవ్ సీన్లను షూటింగ్ చేశారన్న వార్త బాలీవుడ్ లో సెన్సెషనల్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా, ఇతర సినీ వెబ్ సైట్లలో దీపికా, రణ్ వీర్ ల లవ్ సీన్లు వీరవిహారం చేస్తున్నాయి.
ఓ అందమైన చారిత్రాత్మక ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో రామ్ పాత్రలో రణ్ వీర్, గుజరాతీ అమ్మాయి లీలాగా దీపికా నటిస్తోంది. భారీ అంచనాలు ఈ చిత్రం నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్ లో నర్తించింది.