మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్ | Kangana Slams Ex-MP Swamy Who Criticised Making Her Chief Guest At Ramleela | Sakshi
Sakshi News home page

Kangana: మాకు ఇతర భాగాలు కూడా ఉన్నాయి: కంగనా ఘాటు రిప్లై

Published Thu, Oct 26 2023 4:37 PM | Last Updated on Thu, Oct 26 2023 4:46 PM

Kangana Slams Ex MP Swamy Criticised Making Her Chief Guest At Ramleela - Sakshi

బాలీవుడ్ ఫైర్‍బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి కంగనా. ఇటీవలే చంద్రముఖి-2 చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించింది. రాఘవ లారెన్స్ నటించిన ఈ మూవీని రజినీకాంత్‌ నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం తేజస్‌ అనే మూవీతో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది కంగనా.  ఈ చిత్రంలో యుద్ధ విమాన పైలెట్‌గా కనిపించనుంది.

అయితే ఇటీవలే దసరా సందర్భంగా దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణం దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంగనా రనౌత్‌ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా రావణ దహనం చేసిన సంగతి తెలిసిందే.  రామలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొదటి మహిళగా రనౌత్ చరిత్ర సృష్టించింది. ఒక మహిళ రావణుడి దిష్టిబొమ్మను బాణం విసిరి తగులబెట్టడం ఇదే మొదటిసారి.

అయితే ఓ నెటిజన్‌ ట్విటర్‌లో గతంలో కంగనా స్విమ్‌షూట్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈమె కంగనా రనౌతేనా?.. మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్న ఓకే ఒక్క బాలీవుడ్ లేడీ అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన భాజపా మాజీ ఎంపీ సుబ్రమణియమ్ స్వామి నెటిజన్‌ ట్వీట్‌కు స్పందించారు. కంగనాపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు. 

మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. ' కంగనా కోసం ఎస్పీజీ  సంస్థ కాస్తా ఎక్కువగానే పని చేస్తోంది. రాంలీలా మైదానంలో చివరి రోజున ఆమెను ముఖ్య అతిథిగా ఎంపిక చేశారంటే ఎంత మర్యాద ఇస్తున్నారో అర్థమవుతోంది. అది ఒక గౌరవం లేని సంస్థ' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఇది చూసిన కంగనా రనౌత్.. సుబ్రమణ్య స్వామికి  తనదైన శైలిలో కౌంటరిచ్చింది.

కంగనా తన ట్వీట్‌లో రాస్తూ.. 'నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు కేవలం నాకు శరీరమే కారణమని అనుకుంటున్నట్లు ఉన్నారు. నా స్విమ్‌సూట్ ఫోటో గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే మీ స్వభావం అర్థమవుతోంది. మహిళల విషయంలో మీ వక్రబుద్ధి స్పష్టంగా తెలుస్తోంది. అదే స్థానంలో ఒక యువకుడు ఉంటే ఇలాంటి మాటలు అనేవారా? భవిష్యత్తులో అతనొక గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేవారు. అంతే కానీ రాజకీయాల్లోకి రావడానికి తన శరీరాన్ని వాడుకోవడం లేదు కదా అనేవారు.' అని రాసుకొచ్చింది.

ఇది చూస్తుంటే మీలో పాతుకుపోయిన లింగవివక్ష, స్త్రీల పట్ల మీ వక్రబుద్ధి ఏంటో తెలుస్తోంది. స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. ఒక పురుషుడిలాగే గొప్ప నాయకురాలిగా ఉండటానికి అవసరమైన అన్ని అర్హతలు మహిళలకు ఉన్నాయి. ' అంటూ కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. కాగా.. కంగనా నటించిన తేజస్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆమె నటిస్తోన్న మరో చిత్రం ఎమర్జన్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement