Ramleela ground
-
మోదీ చేసింది సరైన పనేనా?: సునీతా కేజ్రీవాల్
Live Updates.. ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కామెంట్లు... ప్రజాస్వామ్యం కావాలో,నియంతృత్వవం కావాలో మీరే(ప్రజలు) నిర్ణయించుకోవాలి నియంతృత్వానికి మద్దతు ఇచ్చేవారిని దేశం నుంచి తరిమిగొట్టాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటివి వాటి విషం రుచి చూసినా మరణిస్తాం ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కామెంట్లు బీజేపీ భ్రమల్లో ముగినిపోయింది. వారికి నేను వెయ్యేళ్లనాటి కథ, నీతిని తెలియజేస్తున్నా. రాముడు సత్యం కోసం యుద్ధం చేశారు. రాముడికి అధికారం, వనరులు లేవు. రాముడికి కానీసం రథం కూడా లేదు. రావణాసురుడికి రథం, వనరులు, యుద్ధ సైన్యం ఉంది. రాముడి వద్ద సత్యం, నమ్మకం, విశ్వాసం, ఓర్పు, తెగువ ఉందని గుర్తు చేశారు. ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేస్తోంది #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "I think that they (BJP) are trapped in illusion. I want to remind them of a thousand-year-old tale and its message. When Lord Ram was fighting for the truth, He did… pic.twitter.com/43vpN9Y107 — ANI (@ANI) March 31, 2024 ఐదు డిమాండ్లు ఇవే... ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల్లో అందరినీ సమానంగా చూడాలి బలవంతంగా ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ , ఐటీ అరెస్ట్‌లు, దాడులు ఆపేయాలి వెంటనే సీఎం అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్‌ను విడిచిపట్టాలి0 ప్రతిపక్షాల ఆర్థిం వనరులను దెబ్బతీయటం ఆపేయాలి బీజేపీ పొందిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సిట్ ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు జరపాలి #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "INDIA Alliance has 5 demands. The Election Commission should ensure equal opportunity in the Lok Sabha elections. Second, the ECI should stop the forceful action… pic.twitter.com/pSUBSFwhvm — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్లు బీజేపీ 400 సీట్లు గెలుపు నినాదం సెటైర్లు ఈవీఎంలు లేకుండా, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపకై ఒత్తిడి పెంచకుండా బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కామెంట్లు ఈడీ, సీబీఐ అండ్ ఐటీ బీజేపీకి చెందిన విభాగాలు. లాలూ ప్రసాద్ యావద్ను చాలా సార్లు వేధించాయి. మాపై వ్యతిరేకంగా కేసులు పెట్టారు. మా కుటుంబంలోని అందరిపై కేసులు మోపారు ఆర్జేడీ నేతలపై తరచూ సోదాలు జరుగుతున్నాయి ఈడీ, ఐడీ సోదాలు జరుగుతునే ఉన్నాయి. మేము ఎప్పడూ భయపడలేదు.. పోరాడుతూనే ఉన్నాం. టీఎంసీ ఇండయా కూటమిలో భాగమే.. ‘టీఎంసీ ఇండియా కూటమిలో భాగమే. ప్రజాస్వామ్యాకి బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోంది’టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. #WATCH | INDIA alliance rally: TMC MP Derek O'Brien says, "...All India Trinamool Congress (TMC) is very much was, is and will be part of the INDIA alliance. This is a fight of BJP versus democracy..." pic.twitter.com/5q2YuoHRCO — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమికి ఆప్ తరఫున మద్దతు తెలుపుతున్నా: సునీతా కేజ్రీవాల్ ఇండియా కూటమి కాదు.. ఇండియా అనేది మనందరి హృదయం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండవు. దేశవ్యాప్తంగా పేదలకు విద్యుత్ ఉచితం. ప్రతి గ్రామంలో పిల్లలు నాణ్యమైన విద్యను పొందే మంచి పాఠశాల ఏర్పాటు గ్రామంలో మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు స్వామినాథన్ నివేదిక ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం. ఢిల్లీ ప్రజలు చాలా ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. మేము అంతం చేస్తాము. ఢిల్లీ ప్రజలకు రాష్ట్ర హోదా పొందుతారు. ఐదేళ్లలో ఈ గ్యారంటీలు అమలుచేస్తాం #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal at the INDIA alliance rally in Ramlila Maidan, Delhi. pic.twitter.com/ah1WM7RhsH — ANI (@ANI) March 31, 2024 ప్రధాని మోదీ కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారు: సునీతా కేజ్రీవాల్ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ లోక్‌తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ర్యాలీ ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కేజ్రీవాల్ పంపిన లేఖలను చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ ప్రధాని మోదీ కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారు మోదీ చేసింది సరైన పనేనా? సీఎం కేజ్రీవాల్ నిజాయితిపరుడని మీరు నమ్మటం లేదా? కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ సింహం లాంటి వ్యక్తి కోట్ల మంది హృదయాల్లో కేజ్రీవాల్ ఉన్నారు #WATCH | INDIA alliance rally: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Your own Kejriwal has sent a message for you from jail. Before reading this message, I would like to ask you something. Our Prime Minister Narendra Modi put my husband in jail, did the Prime… pic.twitter.com/aZsdXXvJOO — ANI (@ANI) March 31, 2024 రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ పంపిన లేఖ చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ దేశం బాధలో ఉందని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. ‘ఇండియా కూటమి’మహా ర్యాలీ.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కామెంట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజకీయ పార్టీలకు కనీస గౌరవం ఇవ్వడాన్ని పూర్తిగా నిరాకరిస్తోంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల విషయంలో మరీ దారుణం ఇలాంటి తరుణంలో లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని ఎలా నమ్ముతాం? దేశంలో ఎన్నికలను బీజేపీ హైజాక్ చేయాలనుకుంటోంది ప్రతిపక్షపార్టీలు, నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోంది అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తోంది #WATCH | On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress MP KC Venugopal says, "Now the Government of India under the leadership of PM Modi is completely refusing to provide a level playing field to political parties, especially the opposition parties. How can you ensure… pic.twitter.com/cw5ZUZoBsl — ANI (@ANI) March 31, 2024 ‘ఇండియా కూటమి’ మెగా ర్యాలీలో పాల్గొనేందుకు అరవింద్ కేజీవాల్ సతీమణి సునితా కేజ్రీవాల్ రాంలీలా మైదానానికి బయల్దేరారు. #WATCH | Delhi: Punjab CM Bhagwant Mann along with Delhi CM and AAP national convener Arvind Kejriwal's wife Sunita Kejriwal leave for Ramlila Maidan to attend the INDIA alliance rally pic.twitter.com/uCYhUes7MN — ANI (@ANI) March 31, 2024 రాజ్యాంగం దాడికి గురవుతోందని కాంగెస్ నేత సుప్రియా శ్రీనతే అన్నారు. రాంలీలా మైదనంలోని మెగా ర్యాలీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజ్యాంగం దాడికి గురవుతోంది. దేశం మొత్తం రాజ్యాంగ రక్షణకు కలిసికట్టుగా ముందుకువెళ్తోంది. ఇదే విషయాన్ని విషయాన్ని తెలియజేయటానికి ర్యాలీకి హాజరవుతున్నా’ అని అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress leader Supriya Shrinate says, "The democracy is being attacked. The whole country is standing in the favour of democracy. And we have come here to give the same message..." pic.twitter.com/WfgEQ8uRtK — ANI (@ANI) March 31, 2024 నియంత, మతతత్వ బీజేపీ పార్టీ విధానాలను ఎండకట్టేందుకు, అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో మహా ర్యాలీలో ప్రజలు. నేతలు పాల్గొంటున్నారని సీఐఎం(ఎం) నేత బృందా కారత్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపా చట్టాన్ని ఈడీ, సీబీ దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సమర్థమంతమైనది కాదనడానికి ఇదే నిదర్శనం అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, CPI-M leader Brinda Karat says, "The message is that people from all over the country have gathered against this dictator and communal government. This Maha rally in Delhi is against Arvind Kejriwal and Hemant… pic.twitter.com/ZmSSr2FjLQ — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ చేపట్టిన మెగా ర్యాలీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రవాల్ మాట్లాడనున్నారు. రాంలీలా మైదానానికి కూటమి నేతలు చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో ఢిల్లీ ప్రజలు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ఢిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్ ఆందోళన.. రాంలీలా మైదనం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. ఆమె మీడియా మాట్లాడారు. ‘ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారు’అని మంత్రి అతిశీ అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, AAP Minister Atishi says, "It is 10 am and people have already gathered in huge numbers. People from all over the country have come against the arrest of Arvind Kejriwal. The people of Delhi are aware that Arvind… pic.twitter.com/6XF8mN5WnU — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమి మెగా ర్యాలీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా రాంలీలా మైదానంలో మహా ధర్నా కేజీవాల్ జైల్లో ఉన్న ఫొటోలు ఏర్పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 13 పార్టీల నేతల హాజరు ఎండ వేడిమి తట్టుకోవడానికి ఏర్పాట్లు మెగా ర్యాలీ వద్ద భారీ భద్రత ఏర్పాటు ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు నకిలీ దర్యాప్తు పేరుతో, మన్నల్ని, మా పార్టీని గత రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ జాతీయ అధికప్రతినిధి ప్రియాంకా కక్కర్ అన్నారు. రామ్‌లీలా మైదానంలో విపక్షాల ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎటువంటి అధారాలు లేకుండా కొందరి నకిలీ ప్రకటనలతో సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేశారు. ఇది మా పార్టీ గొంతు నొక్కాలనే కుట్రలో భాగం. ఎవరైలే బీజేపీ ప్రశ్నిస్తారే వాళ్లను జైల్లో తోయటమే వారి పని’అని ప్రియాంకా మండిపడ్డారు. #WATCH | Delhi: On INDIA alliance rally at Ramlila Maidan, AAP leader AAP national spokesperson Priyanka Kakkar says, " It can be clearly seen how we are being targeted in the for last 2 years in the name of a fake investigation. Without any proof, just based on a few statements,… pic.twitter.com/7Ne4Kfuxcg — ANI (@ANI) March 31, 2024 ►ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి ఇండియా కూటమి రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ►రామ్‌లీల మైదానంలో కళ్లకు గంతులు కట్టుకుని కాంగ్రెస్ నేతల నిరసన #WATCH | Delhi: Congress workers organised a blindfold protest at the Ramlila Maidan. pic.twitter.com/5p0C5mwpRn — ANI (@ANI) March 31, 2024 ►ఇండియా కూటమి ర్యాలీకి బయలుదేరిన జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వానికి స్వస్థి పలికి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అన్నారు. #WATCH | Ranchi: Before leaving for Delhi to attend the INDIA Alliance Maha Rally at the Ramlila Maidan today, Jharkhand CM Champai Soren says, "We have to abolish the dictatorship and save the democracy..." pic.twitter.com/kOHI9A0EiV — ANI (@ANI) March 31, 2024 ►ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంపై ఇండియా కూటమి భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో రూ.1800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. #WATCH | Delhi: INDIA alliance to hold rally against the arrest of Delhi CM and AAP convener Arvind Kejriwal, at Ramlila Maidan from 10 am today (Visuals from the Ramlila Maidan) pic.twitter.com/cahR183k7g — ANI (@ANI) March 31, 2024 కీలక నేతలు హాజరు.. ►ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోసియా గాంధీ, రాహుల్‌గాంధీ సహా కీలకనేతల పాల్గొనబోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇవాళ్టి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు. ఇవాళ్టి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జనసమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. సునీత కేజ్రీవాల్‌కు కల్పన సొరేన్ సంఘీభావం ►ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్‌కు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్ శనివారం సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో వీరి భే టీ జరిగింది.శక్తిమంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉం టుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీశి ట్వీట్ చేశా రు. కల్పన విలేకర్లతో మాట్లాడుతూ, సునీత కేజ్రీవాల్‌కు యావత్తు జార్ఖం డ్ ప్రజలు అండగా ఉంటారని, తాము ఒకరి ఆవేదనను మరొకరం పంచుకున్నామని చెప్పారు.తాము కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామన్నారు. -
మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి కంగనా. ఇటీవలే చంద్రముఖి-2 చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించింది. రాఘవ లారెన్స్ నటించిన ఈ మూవీని రజినీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం తేజస్ అనే మూవీతో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది కంగనా. ఈ చిత్రంలో యుద్ధ విమాన పైలెట్‌గా కనిపించనుంది. అయితే ఇటీవలే దసరా సందర్భంగా దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణం దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంగనా రనౌత్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా రావణ దహనం చేసిన సంగతి తెలిసిందే. రామలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొదటి మహిళగా రనౌత్ చరిత్ర సృష్టించింది. ఒక మహిళ రావణుడి దిష్టిబొమ్మను బాణం విసిరి తగులబెట్టడం ఇదే మొదటిసారి. అయితే ఓ నెటిజన్ ట్విటర్లో గతంలో కంగనా స్విమ్షూట్తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈమె కంగనా రనౌతేనా?.. మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేస్తున్న ఓకే ఒక్క బాలీవుడ్ లేడీ అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన భాజపా మాజీ ఎంపీ సుబ్రమణియమ్ స్వామి నెటిజన్ ట్వీట్‌కు స్పందించారు. కంగనాపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు. మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. ' కంగనా కోసం ఎస్పీజీ సంస్థ కాస్తా ఎక్కువగానే పని చేస్తోంది. రాంలీలా మైదానంలో చివరి రోజున ఆమెను ముఖ్య అతిథిగా ఎంపిక చేశారంటే ఎంత మర్యాద ఇస్తున్నారో అర్థమవుతోంది. అది ఒక గౌరవం లేని సంస్థ' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇది చూసిన కంగనా రనౌత్.. సుబ్రమణ్య స్వామికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. కంగనా తన ట్వీట్లో రాస్తూ.. 'నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు కేవలం నాకు శరీరమే కారణమని అనుకుంటున్నట్లు ఉన్నారు. నా స్విమ్‌సూట్ ఫోటో గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే మీ స్వభావం అర్థమవుతోంది. మహిళల విషయంలో మీ వక్రబుద్ధి స్పష్టంగా తెలుస్తోంది. అదే స్థానంలో ఒక యువకుడు ఉంటే ఇలాంటి మాటలు అనేవారా? భవిష్యత్తులో అతనొక గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేవారు. అంతే కానీ రాజకీయాల్లోకి రావడానికి తన శరీరాన్ని వాడుకోవడం లేదు కదా అనేవారు.' అని రాసుకొచ్చింది. ఇది చూస్తుంటే మీలో పాతుకుపోయిన లింగవివక్ష, స్త్రీల పట్ల మీ వక్రబుద్ధి ఏంటో తెలుస్తోంది. స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. ఒక పురుషుడిలాగే గొప్ప నాయకురాలిగా ఉండటానికి అవసరమైన అన్ని అర్హతలు మహిళలకు ఉన్నాయి. ' అంటూ కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. కాగా.. కంగనా నటించిన తేజస్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆమె నటిస్తోన్న మరో చిత్రం ఎమర్జన్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. With a swimsuit picture and sleazy narrative you are suggesting that I have nothing else to offer except for my flesh to get my way in politics ha ha I am an artist arguably the greatest of all time in hindi films, a writer, director, producer, revolutionary right wing… https://t.co/dEcqamn7qO — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2023 -
Prabhas: రావణ దహనంలో పాల్గొన్న ప్రభాస్
ఢిల్లీ: సౌత్ స్టార్ల క్రేజ్ దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా టాలీవుడ్ నటుడు ప్రభాస్ ‘రావణ దహన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఢిల్లీ లవ్ కుశ్ రామ్‌లీల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. ఆయన్ని చూసేందుకు, ఫొటోలు తీసేందుకు జనం ఎగబడ్డారు. భారత సంస్కృతి పట్ల ప్రభాస్‌కు ఉన్న అంకిత భావం చూసే ఆయన్ని పిలిచామని లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్ అర్జున్ కుమార్ ప్రకటించారు. కోవిడ్ ఫరిస్థితుల్లో రెండేళ్లుగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందువల్ల కమిటీ నిర్వహకులు ఈ సారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా.. ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశం మొత్తం ఆయన పేరు, ప్రఖ్యాతలు విస్తరించాయి. మన భారత చరిత్రలో వేళ్లానుకున్న కథలను ఆయన చిత్రాలుగా ఎంచుకుంటున్నారు. బాహుబలి లాంటి కథతో పాటు ఇప్పుడు ఆదిపురుష్ లాంటి పౌరాణిక చిత్రంలో ఆయన నటించారు. రాముడి పాత్రలో నటించారు గనుకే రావణ దహనం ఈ ఏడాది ఆయనతో చేయిస్తున్నాం అని కుమార్ ప్రకటించారు. ఇక రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ టీం సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వాళ్లిచ్చిన కానుకలను స్వీకరించాడు ప్రభాస్. ఆపై విల్లు ఎక్కుపెట్టి.. రావణ దిష్టిబొమ్మకు సంధించాడు. కార్యక్రమం చివర్లో.. రామావతారంలో ఉన్న నటులకు డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి హారతి పట్టాడు ప్రభాస్. అంతకు ముందు రామాయణంలోని ఘట్టాలు ప్రదర్శించే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆదిపురుష్ టీజర్‌ను సైతం ప్రదర్శించారు. धर्म की विजय हो! 'आदिपुरुष' प्रभास ने दिल्ली की लव कुश रामलीला में तीर चलाकर किया रावण वध..#PrabhasIsAdipurush #Prabhas #Adipurush #Ramleela #LuvKushRamleela #Delhi #RavanDahan pic.twitter.com/bd56ODTe8h — GNTTV (@GoodNewsToday) October 5, 2022 Video Credits: GNTTV Twitter -
ఢిల్లీ : రామ్ లీలా మైదానంలో రావణ దహనం
-
బీజేపీ పాలనతో దేశంలో అభద్రతా భావం పెరిగిపోయింది: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో విద్వేషాలు పెరిగిపోయాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశాన్ని విభజిస్తున్నాయని విరుచుకుపడ్డారు. తమ భవిష్యత్తు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి అంశాలపై ప్రజలు భయపడుతున్నారని, దేశంలో అభద్రతా భావం పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో హస్తం పార్టీ చెపట్టిన ‘మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీ’కి భారీగా జనం తరలివచ్చారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు హాజరై మాట్లాడారు. ‘ ప్రభుత్వం నుంచి ఇద్దరే వ్యాపారవేత్తలు లబ్ధిపొందుతున్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రోడ్లు.. ప్రతిఒక్కటి ఆ ఇద్దరే చేజిక్కించుకుంటున్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని వెనకబడేలా చేస్తున్నారు. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు. దాని ద్వారా పాకిస్థాన్, చైనాలు లబ్ధి పొందుతున్నాయి. పీఎం మోదీ గత 8 ఏళ్లుగా దేశాన్ని బలహీనపరిచారు.’ అని బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ఈ మెగా ర్యాలీకి కార్యకర్తలను సిద్ధం చేసేందుకు వారం రోజులుగా తీవ్రంగా శ్రమించారు కాంగ్రెస్ నేతలు. 22 నగరాల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఢిల్లీ చలో నినాదంతో పిలుపునిచ్చారు. రామ్‌లీలా మైదానంలో ర్యాలీకి ముందు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్వేషాలు ప్రధాన సమస్యలుగా మారాయన్నారు. ఇదీ చదవండి: 150 రోజులు.. 3,570 కిలోమీటర్లు.. రాహుల్ భారత్ జోడో యాత్ర.. కాంగ్రెస్‌కు మంచి రోజులొస్తాయా? -
దేశవ్యాప్త విస్తరణ దిశగా ‘ఆప్’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కనీసం కోటి మందికి చేరువ అవ్వాలన్న లక్ష్యంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. అరవింద్ కేజ్రీవాల్ తాజా మంత్రివర్గంలో సభ్యుడిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్.. ఆప్ రాష్ట్రాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడు విషయాలపై పని చేయాలని నిర్ణయించాం. మొదటిది, అన్ని రాష్ట్రాల పార్టీ యూనిట్లు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్ కార్యక్రమం చేపడ్తాయి. ఇందులో పార్టీ వాలంటీర్లు ప్రజలను కలుస్తారు. కనీసం కోటి మందిని కలవాలనేది లక్ష్యం. అలాగే, దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు కలసిరావాలని కోరుతూ పోస్టర్లతో ప్రచారం చేస్తాం. ఇందుకు 9871010101 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోస్టర్లను అంటిస్తాం. ఆ తరువాత, అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇతర ప్రధాన నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్మీట్లను నిర్వహిస్తారు. దేశ నిర్మాణంలో భాగంగా ఆప్‌లో చేరాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు’ అని గోపాల్ రాయ్ వివరించారు. రానున్న నెలల్లో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నామన్నారు. తద్వారా, ఆయా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలను పొందాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఏయే రాష్ట్రాల్లో పోటీకి దిగాలనేది పార్టీ నాయకత్వం త్వరలో నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ‘ఆప్’ను ప్రాంతీయ పార్టీగానే ఎన్నికల సంఘం గుర్తించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంతో, జాతీయ స్థాయిలో సత్తా చూపాలన్న ఆ పార్టీ కోరిక నెరవేరలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అదీ పంజాబ్‌లోనే. ఢిల్లీలోని అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. -
నేడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
-
కేజ్రీ.. ముచ్చటగా మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(51) ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానం వేదిక కానుంది. మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్ ఈసారి.. రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులు ఉంటారని ఆప్ నేత మనీశ్ సిసోడియా వెల్లడించారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సుమిత్ నగల్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఐటీ సీటు సాధించిన విజయ్ కుమార్, మొహల్లా క్లినిక్ డాక్టర్ ఆల్కా, బైక్ అంబులెన్స్ సర్వీస్ అధికారి యుధిష్టిర్ రాఠీ, నైట్ షెల్టర్ కేర్ టేకర్ సబీనా నాజ్, మెట్రో పైలట్ నిధి గుప్తా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి 1.25లక్షల మంది ప్రజలు తరలివస్తారని భావిస్తున్నామని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రధాని మోదీతోపాటు ఢిల్లీకి చెందిన బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రజలను ఆహ్వానించారు. రాంలీలా మైదానం, పరిసరాల్లో ఢిల్లీ పోలీసు, పారామిలిటరీ దళాలు, సీఆర్పీఎఫ్ కలిపి సుమారు 3 వేల మందిని మోహరించనున్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతోపాటు మైదానం చుట్టుపక్కల బ్యాగేజి స్కానర్లను, డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లను అమర్చారు. మైదానంలోపలా బయటా ‘ధన్యవాద్ ఢిల్లీ’ అంటూ కేజ్రీవాల్ ఫొటో ఉండే భారీ కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ జారీ చేసిన ఆదేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కోరారు. ఈ ఆదేశం నియంతృత్వాన్ని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానిం చారు. ఉపాధ్యాయులకు తాము ఆహ్వానాలు పంపామేతప్ప, ఆదేశాలు కాదని ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. కాబోయే మంత్రులకు కేజ్రీవాల్ విందు ఢిల్లీ అభివృద్ధి కార్యాచరణతోపాటు వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కేజ్రీవాల్ కాబోయే మంత్రులతో చర్చించారు. గత మంత్రివర్గంలోని ఆరుగురికి శనివారం తన నివాసంలో కేజ్రీవాల్ విందు ఇచ్చారు. ఢిల్లీలో రెండు కోట్ల మొక్కలు నాటడం, యమునా నదిని శుద్ధి చేయడం, కాలుష్యం తగ్గించడం వంటి ప్రజలకిచ్చిన 10 హామీల అమలుకు రంగంలోకి దిగాలని సహచరులను కేజ్రీవాల్ కోరారని ఆప్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు. గత మంత్రివర్గంలో ఉన్న సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్ సహా ఆరుగురు మంత్రులు కేజ్రీవాల్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
కేజ్రీవాల్ ప్రమాణానికి సీఎంలకు ఆహ్వానం నో
న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆమ్ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం లేదు. ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎంలు, రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించడం లేదని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్‌రాయ్ చెప్పారు. కేజ్రీవాల్ తన నాయకత్వంపై విశ్వాసం ఉంచి, మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజల మధ్యనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన తెలిపారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలే అతిథులని కేజ్రీవాల్ భావిస్తున్నారని వివరించారు. ఏడాది బుడతడికి పిలుపు అవ్యాన్ తోమర్ అనే చిన్నారికి మాత్రం ప్రత్యేకంగా ఆప్ నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది. కేజ్రీవాల్ మాదిరిగా టోపీ, స్వెట్టర్, మఫ్లర్, కళ్లజోడు ధరించిన ఈ ఏడాది వయస్సున్న ఈ బుడతడు ఢిల్లీలోని ఆప్ కార్యాలయం దగ్గర ఫలితాల వెల్లడిరోజు అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ‘బేబీ మఫ్లర్ మాన్’గా పేరొందిన తోమర్ తల్లిదండ్రులు ఆప్ కార్యకర్తలు. 24 గంటల్లో 11 లక్షల కొత్త సభ్యులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించినట్టు ఆప్ వెల్లడించింది. పార్టీ సభ్యత్వం తీసుకోదలిచిన వారికోసం ఆ పార్టీ ఓ ఫోన్ నంబర్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. పార్టీలో జాయిన్ అవడానికి ఆ నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. -
16న కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా 16న ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ లాంఛనప్రాయంగా కేజ్రీవాల్‌ను ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. భారీగా జన సమీకరణ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆప్ సన్నాహాలు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఒకప్పుడు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఆయనకు కుడిభుజంగా పని చేసి దేశ ప్రజలందరి దృష్టిని కేజ్రీవాల్ ఆకర్షించారు. కేబినెట్లో పాత ముఖాలే ? గత ప్రభుత్వంలో పనిచేసిన వారికే మళ్లీ కేజ్రీవాల్ కేబినెట్లో అవకాశం ఇవ్వనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎలాంటి మార్పులు చేయకపోవచ్చునని తెలుస్తోంది. మనీశ్ సిసోడియా, రాజేంద్ర పాల్ గౌతమ్, సత్యేంద్ర జైన్, కైలాస్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌లు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకోనున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి, ఆప్ విద్యా రంగ సంస్కరణల్లో భాగస్వామిగా నిలిచిన ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా, పార్టీకి కొత్త శక్తిగా మారిన రాఘవ్ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెడతారన్న ప్రచారమూ సాగింది. -
భారత్ బచావో..
-
నా పేరు రాహుల్ సావర్కర్ కాదు
న్యూఢిల్లీ: దేశంలో అత్యాచారాల గురించి తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కుతగ్గబోనని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ ‘రేప్ ఇన్ ఇండియా’వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారత్ బాచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. తనకు తానుగా దేశభక్తుడిగా అభివర్ణించుకునే ప్రధాని.. ఒంటి చేత్తో ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సమయమిదే: సోనియా ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. భారత్ బచావో ర్యాలీలో సోనియా మాట్లాడారు. ప్రజలందరూ అన్యాయంపై గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దేశంలో ప్రస్తుతం అరాచక రాజ్యం నడుస్తోందని, సబ్కా సాథ్, సబ్ కా వికాస్ అన్న అధికార పక్ష నినాదం స్ఫూర్తి ఏదని దేశం మొత్తం ప్రశ్నిస్తోందని ఆమె భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ నాటి అరాచకత్వంపై పోరాడకపోతే మనం చరిత్రలో పిరికివాళ్లుగా మిగిలిపోతామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ తన భారత్ బచావ్ ర్యాలీ ప్రసంగంలో స్పష్టం చేశారు. గాంధీ, నెహ్రూల్లానే సావర్కర్ కూడా.. రాహుల్ ‘సావర్కర్’ వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ‘వీర్ సావర్కర్ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్ చేశారు. సరిపోయే పేరు.. ‘రాహుల్ జిన్నా’: బీజేపీ ముస్లింల ఓట్ల కోసం రాజకీయాలు చేసే రాహుల్‌కు ‘రాహుల్ జిన్నా’అనే పేరు అతికినట్లు సరిపోతుందంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ‘ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేసే నువ్వు మొహమ్మద్ అలీ జిన్నా వారసుడివే తప్ప, సావర్కర్‌కు కాదు’అని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ ఇన్నాళ్లకు నిజం మాట్లాడారు. ఆయన ఎన్నటికీ రాహుల్ సావర్కర్ కాలేరు. నెహ్రూ–గాంధీ కుటుంబంలో 5వ తరం వ్యక్తి సావర్కర్ స్థాయికి సరితూగరు ’అని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వీయ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
దేశంలో వ్యక్తమవుతున్న నిరసనలకు వాళ్లిద్దరే కారణం
-
నా పేరు రాహుల్ సావర్కర్ కాదు
న్యూఢిల్లీ: తాను నిజాలు నిర్భయంగా మాట్లాడతానని.. అందుకు ఎన్నటికీ క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తన పేరు రాహుల్ సావర్కర్ కాదని... రాహుల్ గాంధీ అంటూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. ఈ క్రమంలో ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాహుల్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ స్థానిక రామ్‌లీలా మైదానంలో శనివారం భారత్ బచావో ర్యాలీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, రైతు సమస్యలు, లైంగిక దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. (రాహుల్ వ్యాఖ్యలు.. లోక్‌సభలో దుమారం) ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... నేను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నిన్న పార్లమెంటులో డిమాండ్ చేసిందని.. సత్యం మాట్లాడినందుకు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. ‘ఏదో ఒకరోజు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా జాతిని క్షమాపణ కోరే సమయం వస్తుంది. అందుకు కారణాలు నేను చెబుతాను. మోదీ విధానాలతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోంది. పేదల వద్ద దోచుకుని అంబానీ, అదానీలకు ఆయన దోచిపెడుతున్నారు. మోదీ వారికి 25 పెద్ద కాంట్రాక్టులు ఇచ్చారు. దేశంలో కిలో ఉల్లి ధర రూ. 200 ఐనా పట్టించుకోవడం లేదు’ అని కేంద్ర సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అదే విధంగా... ‘జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. నేడు జీడీపీ వృద్ధి 4 శాతంగా ఉంది. అది కూడా బీజేపీ తన పద్ధతిలో జీడీపీని అంచనా వేసినపుడు. గతంలోలాగా ఇప్పుడు కూడా జీడీపీని కొలిస్తే.. అది ప్రస్తుతం 2.5 శాతానికి దిగజారుతుంది. ఇక దేశంలో నేడు వ్యక్తమవుతున్న నిరసనలకు వాళ్లిద్దరే కారణం. మతాల మధ్య చిచ్చుపెట్టి జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రేఖలు సృష్టించారు. అసోం, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి చూడండి. మోదీ ఆ రాష్ట్రాలను నిరసన జ్వాలల్లో తగులబెట్టారు’ అని దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. ‘ టీవీలో ఒక యాడ్ ముప్పై సెకన్లపాటు కొనసాగాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. అలాంటిది నరేంద్ర మోదీ టీవీలో రోజూ కనిపిస్తున్నారు. ఆ ఖర్చును ఎవరు భరిస్తారు? వాళ్లందరికీ మోదీ ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోవడం’ లేదు అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శల వర్షం కురిపించారు. -
మందిర నిర్మాణం తథ్యం
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశ చరిత్రను మలుపు తిప్పిన మూడో పానిపట్ యుద్ధం వంటివన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ సాంస్కృతిక జాతీయ వాదానికీ, ప్రతిపక్షాల అధికార దాహానికి మధ్యనే జరగనున్నాయని తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. ‘అయోధ్యలో తొందరగా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలని పార్టీ పట్టుదలతో ఉండగా కాంగ్రెస్ అడ్డంకులు కల్పిస్తోంది. అయితే, బీజేపీ రామ మందిరాన్ని నిర్మించి తీరుతుంది’ అని అన్నారు. మందిర నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరేంటో స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, అద్భుతమైన, పారదర్శక, కష్టపడి పనిచేసే నేత బీజేపీకి ఉన్నారు. 1987 నుంచి ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ప్రతిపక్షంలో ఆయనకు సరితూగగల నేత లేరు. మోదీ మాదిరిగా మరెవ్వరూ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు’ అని పేర్కొన్నారు. వారంలో రెండు కీలక నిర్ణయాలు మోదీ ప్రభుత్వం ఈ వారంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుందని అమిత్ చెప్పారు. ఒకటి.. జనరల్ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం. రెండోది జీఎస్టీ మినహాయింపు పరిమితిని పెంచడం. జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ల ద్వారా కోట్లాది మంది యువత ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. దీంతోపాటు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. దీని ప్రకారం రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వారు 1 శాతం పన్ను చెల్లించేలా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. అక్రమాలకు పాల్పడిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీవంటి వారు కాంగ్రెస్ హయాంలో దేశం విడిచి ఎందుకు పారిపోలేదు? కాంగ్రెస్ దేశంలో అవినీతిని ఎలా పెంచి పోషించిందో దీన్నిబట్టి స్పష్టమవుతుంది అని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలోనే ఈ ఆర్థిక నేరగాళ్లంతా ఎందుకు పారిపోయారు? ప్రధాని మోదీ చౌకీదార్ మాదిరిగా ఇలాంటి వారిని ఉపేక్షించబోరని అన్నారు.రైతులకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్న మోదీ సర్కారును ‘రైతు హిత’ ప్రభుత్వంగా పేర్కొంటూ బీజేపీ జాతీయ కౌన్సిల్ ఒక తీర్మానం ఆమోదించింది. దీంతోపాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మరో తీర్మానం చేసింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లోని పార్టీ నేతలు కలిపి 14వేల మంది వరకు హాజరయ్యారు. మోదీకి, మిగతా వారికి మధ్యనే పోటీ ప్రధాని మోదీని ఓడించాలనే చౌకబారు ఎత్తుగడతోనే మహా కూటమి ఏర్పడుతోందనీ, ఈ కూటమికి ఒక విధానం కానీ, నాయకుడు గానీ లేరని అమిత్ అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసిన మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘వచ్చే సాధారణ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటంగా సాగనున్నాయి. సాంస్కృతిక జాతీయ వాదం, పేదల అభ్యున్నతే బీజేపీ పార్టీ లక్ష్యం కాగా, ప్రతిపక్షాలు అధికారమే పరమావధిగా ఏకమవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ‘కూటమిలోని పార్టీలన్నీ 2014 ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైనవే. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ 2014 ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాలు సాధించడం ఖాయం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. -
నేటి నుంచి బీజేపీ జాతీయ మండలి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా నేటి నుంచి రెండ్రోజుల పాటు జాతీయ మండలి సమావేశాలను నిర్వహించనుంది. ఢిల్లీలోని రాంలీల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7,000 మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇటీవల రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ కేడర్ కోలుకోవడంపై అధిష్టానం దృష్టి సారించనున్నారు. ఉపాధ్యక్షులుగా ముగ్గురి నియామకం.. లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్‌లను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించింది. ఇటీవల జరిగిన ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీరి నాయకత్వంలో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఈ ముగ్గురు నేతలను బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. -
మందిర నిర్మాణం మరవొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ దిశగానే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలు సంఘ్ పరివార్ సంస్థల ప్రతినిధులు సహా వేలాది మంది పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీహెచ్‌పీ నిర్వహించిన ఈ సభలో వేలాదిమంది రామభక్తులు, హిందూవాదులు పాల్గొన్నారు. కాషాయ రంగు టోపీలు ధరించి సభకు వచ్చిన వారంతా ‘మాకు శాంపుల్ వద్దు. టెంపుల్ కావాలి. రామరాజ్యం మళ్లీ తెస్తాం. మందిరం నిర్మిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టాలంటే చట్టం తీసుకురావడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మసభలో ప్రసంగిస్తున్న సాధ్వీ రితంభర అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని భయ్యాజీ తెలి పారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలో రాముడి గుడి కడతామని ఈ రోజు అధికారంలో ఉన్నవారు గతంలో మాట ఇచ్చారు. మందిర నిర్మాణం డిమాండ్‌ను నెరవేర్చాలి. ఆలయాన్ని కట్టాలని మేం అడుక్కోవడం లేదు. మా భావాలను వ్యక్తపరుస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ‘న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన దేశం అభివృద్ధి పథంలో నడవదు. సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలు/అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఏ మతంతోనూ గొడవ పడాలనుకోవడం లేదు’ అని భయ్యాజీ పేర్కొన్నారు. ‘మోదీని వదిలిపెట్టం’ హరిద్వార్‌కు చెందిన స్వామి హంసదేవాచార్య మాట్లాడుతూ రామ మందిరాన్ని కట్టకపోతే ప్రధాని మోదీని తాము వదిలిపెట్టబోమని అన్నారు. హామీ మోదీ నెరవేర్చాల్సిందేనని కోరారు. వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోగ్జే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గౌరవించాలనీ, ప్రజలే సుప్రీం తప్ప కోర్టు కాదని అన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్‌కు మద్దతు తెలపాలన్నారు. వీహెచ్‌పీ సభ నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామ్ లీలా మైదానంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రామ్‌లీలా మైదానంలోకి ప్రవేశిస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు -
రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఆధ్యర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన్ ఆక్రోశ్ (ప్రజా ఆగ్రహం) ర్యాలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనదైన శైలిలో విమర్శలు చేశారు. అది జన్ ఆక్రోశ్ కాదని పరివార్ ఆక్రోశ్ (కుటుంబ ఆగ్రహం) అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంబద్ధతకు ఈ ర్యాలీ నిదర్శనమన్నారు. జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓడిపోయినా.. కాంగ్రెస్‌కు ఇంకా జనాక్రోశం అర్థం కాలేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుకు కాంగ్రెస్ ఎందుకు అడ్డు పడిందని అమిత్ షా ప్రశ్నించారు. అధికార దాహంతో కాంగ్రెస్ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఈ రోజు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'జనాక్రోశ్ ర్యాలీ' నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పార్టీ నేతలు ప్రధాని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
నేడు రాజధానిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం చేపట్టనున్న భారీ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమయింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమయిందని ఈ సందర్భంగా చాటనుంది. దీంతోపాటు త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల కార్యక్షేత్రంలోకి ముందుగానే దూకాలనుకుంటున్న రాహుల్..అందుకు అవసరమైన కొత్త ఏఐసీసీ కూర్పులో తలమునకలై ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకల నుంచి పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్నారని అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. రాజధాని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి రానున్నారనీ, వీరంతా ఆదివారం ఉదయం నుంచి ఇక్కడికి చేరుకుంటారని అన్నారు. లక్షమందికి పైగా ర్యాలీకి తరలివస్తారని ఆయన అంచనా వేశారు. -
'రామ్‌లీల' కెపాసిటీ 50 వేలే: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: రామ్‌లీలా మైదానంలో 50 వేల మంది మాత్రమే పడతారని, కాంగ్రెస్ పార్టీ మాత్రం లక్షల మంది వచ్చారని గొప్పలు చెప్పుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రామ్‌లీలా మైదానంలో ఈ ఉదయం కిసాన్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టారు. దీనిపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్ద ఎత్తున భూసేకరణ జరిగిందన్నారు. తక్కువ పరిహారంతో పేదల భూములను లాక్కుంది కాంగ్రెస్ పార్టీయే నని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన భూములను తిరిగి ఇస్తుందా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో బొగ్గు గనుల బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుపడిందని చెప్పారు. అయినప్పటికీ తాము ఆమోదింపచేయించినట్లు తెలిపారు. భూ సేకరణ బిల్లు ఆమోదం పొందేందుకు పార్టీలు సహకరించాలని వెంక్యయ్య నాయుడు కోరారు. -
రాష్ట్రం విడిపోదు : అశోక్‌బాబు
* రాహుల్, కేసీఆర్ తుగ్లక్‌లు: అశోక్‌బాబు * ఉద్వేగంతో కంటతడి పెట్టిన లగడపాటి * సోనియాకూ ఇందిరా, రాజీవ్ గతే: మోదుగుల * ముందు కేంద్రం క్షమాపణ చెప్పాలి: ఉండవల్లి * నేడు చివరి రోజు.. జాతీయ నేతల హాజరు న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విభజన జరగదని, ఆపడానికి దేవుడు ఏదొక రూపంలో వస్తాడని సమైక్యాంధ్ర నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏపీ ఎన్జీవో తలపెట్టిన రెండు రోజుల ధర్నా సోమవారం ప్రారంభమైంది. ఈ ధర్నాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ జేఏసీల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామికంగానే విభజనను అడ్డుకుని తీరతామన్నారు. మంగళవారం జాతీయ నేతలు ధర్నాలో పాల్గొంటారన్నారు. ‘రాహుల్, కేసీఆర్ తుగ్లక్‌లు. అందుకే తుగ్లక్ రోడ్డులోనే ఉంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. పౌరుషం చూపితే పారిపోయారు: లగడపాటి ‘‘విభజన సమయానికి కచ్చితంగా పార్లమెంటులో అడుగుపెట్టి తీరుతా. నన్ను ఏ శక్తీ ఆపలేదు. తెలుగువాడి సత్తా ఏమిటో ఈ నెల 13న పార్లమెంటులో చూశారు. పౌరుషం చూపిస్తే అన్ని ప్రాంతాల ఎంపీలూ పార్లమెంటును విడిచిపెట్టి పారిపోయారు. విభజనను ఆపి తీరతాం. దానికి మన వ్యూహాలు మనకున్నాయి’’ అని ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. అడ్డగోలు విభజనకు పూనుకుంటున్న కేంద్రమే ముందుగా క్షమాపణ చెప్పాలని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ‘‘అబల లాంటి ఆంధ్రాను కేంద్రం రేప్ చేయజూసినందుకే పెప్పర్ స్ప్రేను ఉపయోగించారు. అదేమీ తప్పు కాదు. ఆత్మరక్షణ చేసుకోవాలని ప్రభుత్వమే చెప్పింది. స్ప్రే వాడే పరిస్థితులు తెచ్చినందుకు కేంద్ర పాలకులు సిగ్గుపడాలి’’ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులంతా ఉద్యమించాలని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. కొత్త జంటను విడదీస్తే ఎంత పాపమో, విభజన కూడా అంతే పాపమని మరో మంత్రి కాసు కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విభజించడానికి వీళ్లెవరని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విభజనను అడ్డుకోవడానికి దేవుడే వస్తాడని టీడీపీ ఎంపీలు శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. సిక్కుల మధ్య చిచ్చు పెట్టినందుకు ఇందిరాగాంధీకి, తమిళుల మధ్య చిచ్చు పెట్టినందుకు రాజీవ్‌గాంధీకి పట్టిన గతే ఇప్పుడు తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్న సోనియాకు కూడా పడుతుందని మోదుగుల హెచ్చరించారు. అన్నదమ్ములను విడదీసేది ఇలాగేనా అని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. ఎంపీ సబ్బంహరి, టీడీపీ నేతలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేత చంద్రశేఖర్‌రెడ్డి, చలసాని శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. తుదిశ్వాస వరకు ‘సమైక్య’ పోరులో... సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ ఎన్జీవో నేత చిరమన దామోదర జోషి గుండెపోటుతో మృతి చెందారు. రామ్‌లీలా మైదానంలో ఉదయం ధర్నా మొదలవుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. దీనిపై వక్తలంతా సంతాపం తెలిపారు. జోషి కుటుంబసభ్యులకు ఎంపీలు సుజనా చౌదరి రూ. 3 లక్షలు, కేవీపీ రామచంద్రరావు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. జోషి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మునుబోలు ఎంపీడీవో కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జోషి నెల్లూరు జ్యోతినగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సకల జనుల సమ్మె విజయవంతమవడంలో కీలకపాత్ర పోషించారు. విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు సంబంధించి నెల్లూరు జిల్లా నుంచి ఏర్పాట్లన్నీ జోషియే దగ్గరుండి చూసుకున్నారు. రైల్లో ఢిల్లీ వెళ్లిన ఆయన చివరకు సమైక్య పోరులోనే అసువులుబాశారు. జోషి భార్య నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. -
న్యూఢిల్లీలో ఏపీఎన్జీవో నేత గుండెపోటుతో మృతి
సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు సోమవారం రాంలీలా మైదానంలో చేపట్టిన ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది.నెల్లూరు జిల్లా ఏపీఎన్జీవో ఉపాధ్యక్షుడు దామోదర్ జోషికి తీవ్ర గుండె పోటు వచ్చింది. దాంతో ఆయన సహచరులు వెంటనే స్పందించి దామోదర్ జోషిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మార్గమధ్యంలోనే మరణించారు. దామోదర్ జోషి మృతికి ఏపీఎన్జీవోలు రాంలీలా మైదానంలో సంతాపం తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు ఏపీఎన్జీవోలు దేశ రాజధానిలోని రాంలీలా మైదానంలో సోమవారం మహాధర్నా చేపట్టారు.అందులోభాగంగా సీమాంధ్రలోని పలు జిల్లా నుంచి మొత్తం మూడు రైళ్లలో వేలాది మంది ఏపీఎన్జీవోలు న్యూఢిల్లీ తరలివెళ్లారు.అలా వెళ్లిన దామోదర్ జోషి మృతి చెందడంతో అటు రాంలీలా మైదానం ఇటు నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది.