వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: రామ్లీలా మైదానంలో 50 వేల మంది మాత్రమే పడతారని, కాంగ్రెస్ పార్టీ మాత్రం లక్షల మంది వచ్చారని గొప్పలు చెప్పుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రామ్లీలా మైదానంలో ఈ ఉదయం కిసాన్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టారు. దీనిపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్ద ఎత్తున భూసేకరణ జరిగిందన్నారు. తక్కువ పరిహారంతో పేదల భూములను లాక్కుంది కాంగ్రెస్ పార్టీయే నని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన భూములను తిరిగి ఇస్తుందా? అని ప్రశ్నించారు.
పార్లమెంటులో బొగ్గు గనుల బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుపడిందని చెప్పారు. అయినప్పటికీ తాము ఆమోదింపచేయించినట్లు తెలిపారు. భూ సేకరణ బిల్లు ఆమోదం పొందేందుకు పార్టీలు సహకరించాలని వెంక్యయ్య నాయుడు కోరారు.