Subramania Swamy
-
విశ్వసనీయత కలిగిన నాయకుడు సీఎం జగన్
తిరుపతి లీగల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి విశ్వసనీయత కలిగిన నాయకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రికపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దాఖలు చేసిన కేసులో వాదనలు వినిపించేందుకు గురువారం తిరుపతి వచ్చిన సుబ్రమణ్యస్వామి... కోర్టు సముదాయం ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికలపై తన అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు కోరగా... ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజల్లో మంచి విశ్వసనీయత గల నాయకుడిగా గుర్తింపు పొందారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని సుబ్రమణ్యస్వామి తెలిపారు. అదేవిధంగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల గురించి కూడా ఆయన స్పందన కోరగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో కాంగ్రెస్ పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతిపై టీటీడీ పరువు నష్టం కేసు విచారణ 27కి వాయిదా ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ దాఖలు చేసిన రూ.వంద కోట్లు పరువునష్టం దావా కేసు విచారణను కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. తిరుపతి పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ గురువారం జరిగింది. ఈ కేసులో టీటీడీ తరఫున గతంలో దాఖలైన రెండు పిటీషన్లపై బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపించారు. టీటీడీ దాఖలు చేసిన పత్రాలను కోర్టు స్వీకరించాలని, అలాగే టీటీడీ తరఫున సాక్ష్యం ఇవ్వడానికి అనుమతిపత్రాన్ని కోర్టు స్వీకరించాలని ఆయన కోరారు. వాదనల సమయంలో ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది లేకపోవడంతో వారి వాదనలు వినడానికి జడ్జి కేసును వాయిదా వేస్తూ డాకెట్‌పై రాశారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది వచ్చి... ఈ కేసును కొంతసేపు పక్కన పెట్టాలని, ఆంధ్రజ్యోతి తరఫున పిటిషన్ దాఖలు చేస్తామని కోరారు. అయితే అప్పటికే కేసును వాయిదా వేయడంతో ఈ నెల 27న ఆంధ్రజ్యోతి తరఫున వాదనలు వినిపించాలని, అలాగే పిటిషన్ కూడా అదేరోజు దాఖలు చేయాలని జడ్జి సూచించారు. వాయిదాలు తీసుకుంటున్నారు... తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబరు ఒకటో తేదీన ప్రచురించిన కథనంపై టీటీడీ దాఖలు చేసిన కేసును తాను వాదించడానికి అర్హత లేదంటూ ఆంధ్రజ్యోతి కోర్టుల్లో వాయిదాలపై వాయిదాలు తీసుకుంటూ వచ్చి0దని సుబ్రమణ్యస్వామి మీడియాతో చెప్పారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులోనూ తాను వాదించడానికి వీల్లేదని పిటిషన్ వేయగా, న్యాయస్థానం కొట్టివేసిందని ఆయన గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా తాను పలు కేసులను వాదించానని సుబ్రమణ్యస్వామి చెప్పారు. అయితే, తనకు వాదనలు వినిపించడానికి అర్హత లేదంటూ ఆంధ్రజ్యోతి యాజమాన్యం వాదించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సుబ్రమణ్యస్వామితోపాటు టీటీడీ న్యాయ సలహాదారుడు యుగంధర్‌రెడ్డి, న్యాయవాది దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి కంగనా. ఇటీవలే చంద్రముఖి-2 చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించింది. రాఘవ లారెన్స్ నటించిన ఈ మూవీని రజినీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం తేజస్ అనే మూవీతో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది కంగనా. ఈ చిత్రంలో యుద్ధ విమాన పైలెట్‌గా కనిపించనుంది. అయితే ఇటీవలే దసరా సందర్భంగా దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణం దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంగనా రనౌత్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా రావణ దహనం చేసిన సంగతి తెలిసిందే. రామలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొదటి మహిళగా రనౌత్ చరిత్ర సృష్టించింది. ఒక మహిళ రావణుడి దిష్టిబొమ్మను బాణం విసిరి తగులబెట్టడం ఇదే మొదటిసారి. అయితే ఓ నెటిజన్ ట్విటర్లో గతంలో కంగనా స్విమ్షూట్తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈమె కంగనా రనౌతేనా?.. మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేస్తున్న ఓకే ఒక్క బాలీవుడ్ లేడీ అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన భాజపా మాజీ ఎంపీ సుబ్రమణియమ్ స్వామి నెటిజన్ ట్వీట్‌కు స్పందించారు. కంగనాపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు. మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. ' కంగనా కోసం ఎస్పీజీ సంస్థ కాస్తా ఎక్కువగానే పని చేస్తోంది. రాంలీలా మైదానంలో చివరి రోజున ఆమెను ముఖ్య అతిథిగా ఎంపిక చేశారంటే ఎంత మర్యాద ఇస్తున్నారో అర్థమవుతోంది. అది ఒక గౌరవం లేని సంస్థ' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇది చూసిన కంగనా రనౌత్.. సుబ్రమణ్య స్వామికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. కంగనా తన ట్వీట్లో రాస్తూ.. 'నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు కేవలం నాకు శరీరమే కారణమని అనుకుంటున్నట్లు ఉన్నారు. నా స్విమ్‌సూట్ ఫోటో గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే మీ స్వభావం అర్థమవుతోంది. మహిళల విషయంలో మీ వక్రబుద్ధి స్పష్టంగా తెలుస్తోంది. అదే స్థానంలో ఒక యువకుడు ఉంటే ఇలాంటి మాటలు అనేవారా? భవిష్యత్తులో అతనొక గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేవారు. అంతే కానీ రాజకీయాల్లోకి రావడానికి తన శరీరాన్ని వాడుకోవడం లేదు కదా అనేవారు.' అని రాసుకొచ్చింది. ఇది చూస్తుంటే మీలో పాతుకుపోయిన లింగవివక్ష, స్త్రీల పట్ల మీ వక్రబుద్ధి ఏంటో తెలుస్తోంది. స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. ఒక పురుషుడిలాగే గొప్ప నాయకురాలిగా ఉండటానికి అవసరమైన అన్ని అర్హతలు మహిళలకు ఉన్నాయి. ' అంటూ కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. కాగా.. కంగనా నటించిన తేజస్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆమె నటిస్తోన్న మరో చిత్రం ఎమర్జన్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. With a swimsuit picture and sleazy narrative you are suggesting that I have nothing else to offer except for my flesh to get my way in politics ha ha I am an artist arguably the greatest of all time in hindi films, a writer, director, producer, revolutionary right wing… https://t.co/dEcqamn7qO — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2023 -
‘పాక్.. త్వరలోనే అఫ్గనిస్తాన్‌లో కలుస్తుంది’
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అక్రమాలు కొనసాగుతున్నాయి. కాందహార్, హెరాత్ నగరాలను స్వాధీనం చేసుకున్న తరువాత తిరుగుబాటుదారులు ప్రావిన్షియల్ రాజధానులు, ఖలాట్, టెరెన్‌కోట్, ఫెరూజ్ కో, కాలా-ఇ నవ్, పుల్-ఇ ఆలం, లష్కర్ గాహ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు తాలిబన్లు 18 ప్రాంతీయ రాజధానులపై పట్టు సాధించినట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. త్వరలో తాలిబన్లు పాకిస్తాన్‌ను ఆక్రమించుకుని.. అఫ్గనిస్తాన్‌లో కలిపేస్తారని తెలిపారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సులకు విముక్తి కల్పించి.. సొంత దేశాలుగా ఏర్పాటు చేసే సమయం ఆసన్నమయిందన్నారు. ఈ విషయంలో పాక్, అమెరికా, భారత్‌ల సాయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు. అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లకు వ్యతిరేకంగా అనేక వైమానిక దాడులను ప్రారంభించిన తర్వాత అమెరికా ఉద్దేశాల గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అసురక్షితంగా ఉన్నారంటూ ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. సుబ్రమణియన్ స్వామి ఇలా ట్వీట్ చేశారు. Pakistan? Soon it will become part of greater Talibanized Afghanistan. Time to liberate Baluchi, Pakhtoonis and Sindhis to form their own countries and have military alliance with US & India — Subramanian Swamy (@Swamy39) August 13, 2021 -
‘ఆ మ్యానిఫెస్టోలో రెండు తప్పులు’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు గుప్పించారు. పార్టీ మ్యానిఫెస్టోలో రెండు తప్పిదాలున్నాయని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచారని, అంటే ఏటా 24 శాతం వృద్ధి రేటు సాధిస్తేనే ఈ హామీ నెరవేర్చగలరని..అయితే ఇది కష్టసాధ్యమని స్వామి అన్నారు. ఏటా పది శాతం వృద్ధి రేటు సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా భారత కంపేరబుల్ జీడీపీ ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద వ్యవస్థ కాదని, మూడవ అతిపెద్ద ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు తప్పిదాలను సవరించాలని తాను కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు సూచించానని ట్వీట్ చేశారు. కాగా, 20 మంది సభ్యులతో కూడిన బీజేపీ మ్యానిఫెస్టో కమిటీకి కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ నేతృత్వం వహించగా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర నేతలు సభ్యులుగా ఉన్నారు. -
‘అయోధ్యలో ప్రార్థనలు ప్రాథమిక హక్కు’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని రామమందిర్-బాబ్రీ మసీదు స్ధలంలో పూజలు నిర్వహించే ప్రాథమిక హక్కు తనకుందని అంటూ బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సోమవారం సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. అయోధ్య కేసు విచారణ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చే సమయంలో మంగళవారం కోర్టుకు హాజరైతే ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా సుబ్రహ్మణ్య స్వామిని కోరారు. అయితే తన అప్పీల్‌ను సత్వరమే విచారించాలని, దీన్ని ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని స్వామి సర్వోన్నత న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేశారు.అయోధ్య కేసును విచారించే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహించే జస్టిస్ గగోయ్ స్వామి వినతిని తోసిపుచ్చుతూ మంగళవారం జరిగే అయోథ్య కేసుపై విచారణ సమయంలో న్యాయస్ధానంలో ఉండాలని ఆయనను కోరారు. కాగా అయోధ్య కేసును విచారించే సుప్రీం బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి గగోయ్‌తో పాటు జస్టిస్ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లున్నారు.అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పదభూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. -
సోనియా, చిదంబరం జైలుకే: సుబ్రమణ్యస్వామి
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ కేంద్రమంత్రి చిదంబరం జైలుకు వెళ్తారని, 2019లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆదివారం నగరంలో మహిళా వాణిజ్యవేత్త(ఫిక్కీ)ల గ్రూప్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని రాజకీయ పరిణామాలు, ఇతర కీలకాంశాలు, ఆర్థిక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రచయిత, కాలమిస్ట్ శ్రీరాం కర్రి అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్పర్సన్ ప్రియాంక గనేరీవాల్ అరోరా తదితరులు పాల్గొన్నారు. ఫిక్కీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సుబ్రమణ్యస్వామి సమాధానాలిచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసుకుని స్వదేశంలోనే ఉద్యోగం చేయాలని వచ్చానని, నాటి ప్రధాని ఇందిరాగాంధీ సోవియట్ రష్యా విధానాల పట్ల మొగ్గు చూపడాన్ని సహించలేక తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు. ఆమె కోపానికి బలై ఉద్యోగం కోల్పోవలసి వచ్చిందని, తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నాడు ఇందిరాగాందీ, తర్వాత సోనియా, జయలలిత... ఇలా ఆడవాళ్లతోనే శత్రుత్వం ఎందుకు పెట్టుకున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ తనకు మాయావతి, మమతాబెనర్జీ మంచి ఫ్రెండ్స్ అని, లింగ సమానతను నమ్ముతానని ఆయన చమత్కరించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పారదర్శకంగా ఉండే వ్యక్తి అని, సోనియాని పెళ్లాడటమే ఆయన చేసిన తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ చనిపోయే సమయానికి సోనియా, రాజీవ్‌ల మధ్య వాతావరణం అంత సామరస్యంగా ఏమీ లేదన్నారు. ఆదాయపన్నుతో అవస్థలే.. ఆదాయపన్నుతో ఇబ్బందులు పడుతున్నవారు దిగువ, మధ్యతరగతి వారేనని, తాను ఆర్థికమంత్రినైతే ఆదాయపన్నును రద్దు చేస్తానని సుబ్రమణ్యస్వామి అన్నారు. దేశంలో రెవెన్యూ ఆదాయం పెంచేందుకు ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి నాటికి బాబ్రీ మసీదు కేసులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బీజేపీలో చేరాలనుకున్నా ఆ పార్టీ తోసిపుచ్చిందని చెప్పారు. గతంలో సోనియా ప్రధాని కాకుండా ఉండేందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90 శాతం పాత్ర పోషిస్తే తాను 10 శాతం పాత్ర పోషించానని, అందుకే అబ్దుల్ కలాం రెండోసారి రాష్ట్రపతి కాకుండా ఆమె అడ్డుకున్నారన్నారు. జీఎస్టీ, ఆధార్‌తో దేశప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. మోదీ నియంత కాదని కితాబునిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి అర్థశాస్త్రం తెలియదన్నారు. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదన్నారు. -
సుబ్రహ్మణ్యం స్వామి రాయని డైరీ
ఉదయాన్నే జ్యోతిష్కుడు వచ్చి కూర్చున్నాడు! అమిత్‌షాకు నుదుటి మీద పెద్ద బొట్టు పెట్టి, మెడలో రుద్రాక్ష మాల వేసి, చేతిలో కొన్ని తాళపత్రాలను పెడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఆ జ్యోతిష్కుడు. ‘‘అమ్మగారు పిలిపించారు స్వామిగారూ’’ అన్నాడు లే చి నిలబడి! చెయ్యి చూసేవాడు పైచెయ్యిగా ఉండాలి. పైకి లేచి నిలబడకూడదు. డౌటొచ్చింది నాకు. తెలిసే చేతులు చూస్తున్నాడా? తెలుసుకోడానికి చేతులు చూస్తున్నాడా? ‘‘కూర్చోండి’’ అన్నాను. ‘మీరు కూర్చున్నాకే..’ అన్నట్లు నిలబడిపోయాడు! జ్యోతిష్కుడికి అతి వినయం, మిత భాషణం పనికిరావు. అతడి దగ్గర రెండూ ఉన్నాయి. నా చెయ్యి ఇవ్వకూడదని డిసైడ్ అయిపో యాను. ‘‘ఢిల్లీలో అప్పుడే చలి మొదలైనట్లుంది’’ అంటూ చేతుల్ని లాల్చీలో పెట్టుకుని కూర్చున్నాను. ‘‘అవునవును స్వామిగారూ’’ అంటూ తనూ చేతుల్నీ రుద్దుకుంటూ కూర్చున్నాడు! చలి లేకుండానే నాకోసం చేతులు రుద్దుకుంటున్నాడంటే.. నా సంతోషం కోసం లేనివి కూడా ఉన్నట్లు చెప్పేస్తాడు. ‘‘బాగా నిద్ర పట్టేసింది. లేవడం కొద్దిగా ఆలస్యం అయింది’’ అన్నాను. ‘‘అమ్మగారు చెప్పారు స్వామిగారూ.. మీరు మంచి నిద్రలో ఉన్నారని’’ అన్నాడు. ‘‘చెప్పండి జ్యోతిష్కుడు గారూ నా ఫ్యూచర్ ఎలా ఉంది’’ అని అడిగాను. ‘‘ఫ్రెష్‌గా ఉంది’’ అన్నాడు! ‘‘నా ముఖం ఎలా ఉందని కాదు నేను అడిగింది జ్యోతిష్కుడు గారూ.. నా ఫ్యూచర్ ఎలా ఉందీ అని..’’ అన్నాను. ‘‘ముఖం ఫ్రెష్‌గా ఉంటే, ఫ్యూచరూ ఫ్రెష్‌గా ఉంటుంది స్వామిగారూ.. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఫ్యూచర్’’ అన్నాడు! అని, తన చేతిని చూసుకుంటూ ఉండిపోయాడు! ‘‘నా చెయ్యి ఇమ్మంటే ఇస్తాను జ్యోతిష్కుడు గారూ.. మీ చెయ్యెందుకు చూసుకుంటున్నారు’’ అని అడిగాను. ‘‘చూసుకోవడం కాదు స్వామిగారూ.. కాలిక్యులేషన్స్ వేసుకుంటున్నాను’’ అని నావైపు చూసి నవ్వాడు. ‘‘రాహువు మీ జన్మస్థానాన్ని వదిలిపెట్టే రోజు దగ్గరపడింది. జీవితం దేదీప్యమానంగా ఉండబోతోంది’’ అన్నాడు! ‘‘ఆల్రెడీ దేదీప్యమానంగానే ఉంది కదా జ్యోతిష్కుడు గారూ.. డెబ్భయ్ ఎనిమిదేళ్ల వయసులో హాయిగా నిద్రపట్టడం కన్నా జీవితానికి దేదీప్య మానం ఏముంటుంది?’’ అని అన్నాను. జ్యోతిష్కుడు నవ్వాడు. మీకు నిద్రపట్టడం గురించి కాదు స్వామిగారూ నేను చెబుతున్నదీ.. మీరు మీ పార్టీకి నిద్రపట్టనివ్వక పోవడం గురించి’’ అన్నాడు. అతడిపై నమ్మకం కుదిరింది. చేతులు జోడించి నమస్కరించాను. - మాధవ్ శింగరాజు -
క్రమశిక్షణతో ఉన్నాను కాబట్టే..!
జైట్లీపై సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ న్యూఢిల్లీ: క్రమశిక్షణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. ‘కొందరు అడగకుండానే సలహాలిస్తున్నారు. నేను ఒకవేళ క్రమ శిక్షణను ఉల్లంఘించి ఉంటే పర్యవసానాలు మరోలా ఉండేవన్న సంగతి వారికి తెలియదు’ అని జైట్లీ పేరును ప్రస్తావిం చకుండా ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌లను స్వామి విమర్శించడం తెలిసిందే. దీంతో క్రమశిక్షణతో, విచక్షణ కోల్పోకుండా ప్రవర్తించాలని స్వామికి జైట్లీ సూచించారు. దీనిపై స్వామి ట్విటర్లో స్పందించారు. విదేశాలకు వెళ్లే కేంద్ర మంత్రులు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించాలని బీజేపీ పెద్దలను కోరారు. కోటు ధరించి, టై కట్టుకుంటే మంత్రులు వెయిటర్లలా కనబడుతున్నారని.. బ్యాంక్ ఆఫ్ చైనా చైర్మన్ గౌలీతో జైట్లీ దిగిన ఫొటోలనుద్దేశించి మరో ట్వీట్ చేశారు. స్వామి వ్యాఖ్యలపై బీజేపీ అసంతృప్తితో ఉంది.