సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అక్రమాలు కొనసాగుతున్నాయి. కాందహార్, హెరాత్ నగరాలను స్వాధీనం చేసుకున్న తరువాత తిరుగుబాటుదారులు ప్రావిన్షియల్ రాజధానులు, ఖలాట్, టెరెన్‌కోట్, ఫెరూజ్ కో, కాలా-ఇ నవ్, పుల్-ఇ ఆలం, లష్కర్ గాహ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు తాలిబన్‌లు 18 ప్రాంతీయ రాజధానులపై పట్టు సాధించినట్లు సమాచారం.
ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. త్వరలో తాలిబన్లు పాకిస్తాన్‌ను ఆక్రమించుకుని.. అఫ్గనిస్తాన్‌లో కలిపేస్తారని తెలిపారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సులకు విముక్తి కల్పించి.. సొంత దేశాలుగా ఏర్పాటు చేసే సమయం ఆసన్నమయిందన్నారు. ఈ విషయంలో పాక్, అమెరికా, భారత్‌ల సాయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు.
అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లకు వ్యతిరేకంగా అనేక వైమానిక దాడులను ప్రారంభించిన తర్వాత అమెరికా ఉద్దేశాల గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అసురక్షితంగా ఉన్నారంటూ ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. సుబ్రమణియన్ స్వామి ఇలా ట్వీట్ చేశారు.
Pakistan? Soon it will become part of greater Talibanized Afghanistan. Time to liberate Baluchi, Pakhtoonis and Sindhis to form their own countries and have military alliance with US & India
— Subramanian Swamy (@Swamy39) August 13, 2021
Comments
Please login to add a commentAdd a comment