సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు గుప్పించారు. పార్టీ మ్యానిఫెస్టోలో రెండు తప్పిదాలున్నాయని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచారని, అంటే ఏటా 24 శాతం వృద్ధి రేటు సాధిస్తేనే ఈ హామీ నెరవేర్చగలరని..అయితే ఇది కష్టసాధ్యమని స్వామి అన్నారు.
ఏటా పది శాతం వృద్ధి రేటు సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా భారత కంపేరబుల్ జీడీపీ ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద వ్యవస్థ కాదని, మూడవ అతిపెద్ద ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు తప్పిదాలను సవరించాలని తాను కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు సూచించానని ట్వీట్ చేశారు. కాగా, 20 మంది సభ్యులతో కూడిన బీజేపీ మ్యానిఫెస్టో కమిటీకి కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ నేతృత్వం వహించగా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర నేతలు సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment