
దీపికా పదుకొనెతో కంగనా ఢీ
బాలీవుడ్ అందాల భామలు దీపికా పదుకొనె, కంగనా రనౌత్ ఇద్దరూ పోటీపడుతున్నారు. సినిమాలో పాత్ర కోసమో లేక ప్రియుడి కో్సమో కాదు. ఈ ముద్దుగుమ్మలు నటించిన సినిమాలు రెండూ ఒకే రోజు విడుదలవుతున్నాయి. రణవీర్ సింగ్ జోడీగా దీపిక నటించిన 'రామ్ లీలా'ను, కంగనా చిత్రం 'రజ్జో'ను నవంబర్ 15న విడుదల చేస్తున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన రామ్ లీలా సినిమాపై ఇప్పటికే అంచనాలున్నాయి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమా ట్రయల్స్ చూసి బాగున్నాయంటూ ప్రశంసించారు. ఇక విశ్వాస్ పాటిల్ దర్శకత్వంలో తెరకెక్కించిన రజ్జో సినిమాలో కంగనా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాపై కంగనా భారీ ఆశలు పెట్టుకుంది. బాక్సాఫీసు వద్ద ఏ సినిమా హిట్ కొడుతుందో చూడాలి.