‘రాంలీలాలో రణవీర్, దీపికాల కెమిస్ట్రీ అదిరింది’ | Ranveer singh and Deepika Padukone are fond of each other: Sanjay Leela Bhansali | Sakshi
Sakshi News home page

‘రాంలీలాలో రణవీర్, దీపికాల కెమిస్ట్రీ అదిరింది’

Published Sat, Nov 9 2013 9:19 PM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

Ranveer singh and Deepika Padukone  are fond of each other: Sanjay Leela Bhansali

ముంబై: రాంలీలా సినిమాలో ప్రధాన పాత్రధారులైన రణ్‌వీర్, దీపికా పదుకొణేల మధ్య కెమిస్ట్రీ బాగా కలిసిందని, ఇద్దరు సహజ ధోరణిలో నటించడం వల్ల  సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చిందని దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి పేర్కొన్నాడు. ఈ ఇద్దరు నటులకు ఒకరంటే మరొకరికి ఇష్టమని, ఈ సినిమా  షూటింగ్‌ను ఆరంభం నుంచి చివరిదాకా వారిరువురూ బాగా ఆస్వాదించారన్నాడు. ‘ట్రయలర్ హిట్ కాగానే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అందరిలోనూ ఎంతో ఆసక్తి రేకెత్తించింది. ఇది సినిమాకు ఎంతగానో ఉపయోగపడింది. ఓ ప్రేమకథా చిత్రంలో హీరో, హీరోయిన్ లమధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చినట్టయితే, వారిద్దరి ప్రేమను వీరు ఆస్వాదించినట్లయితే... అటువంటి ప్రేమకథా చిత్రాలు విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి’ అని భన్సాలి అభిప్రాయపడ్డాడు. వీరిరువురి కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా పండిందన్నాడు.
 
 
 అందువల్ల ఈ గొప్పదనమంతా వారిరువురికే దక్కుతుందన్నాడు. నిజజీవితంలో వారిరువురి మధ్య ఏదైనా ఉందా లేదా అనే విషయం తనకు తెలియదని, సినిమా దర్శకుడిగా అది తనకు సంబంధం లేని విషయమని అన్నాడు. వారిద్దరినీ అలా చూడడం ఎంతో ఉత్సుకత కలిగించిందన్నాడు. వారిరువురూ ఈ సినిమాలో ఎంతో  అద్భుతంగా నటించారన్నాడు. ఏదిఏమైనప్పటికీ తప్పనిసరిగా తన దృష్టంతా సినిమాపైనే ఉండక తప్పదన్నాడు. ఈ సినిమాతో అనుసంధానం కావాల్సింది ప్రేక్షకులేనన్నాడు. అన్నిటికంటే అదే ముఖ్యమన్నాడు. ఒకే విషయాన్ని ఏ వ్యక్తి అయినా పదే పదే చెబితే విసిగించినట్లవుతుందన్నాడు. అందువల్ల వూహించినదానికంటే భిన్నంగా తీసినపుడే ప్రేక్షకులు సినిమాలను బాగా ఆదరిస్తారన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement