
దీపిక నాకు చాలా స్పెషల్
దీపికా పడుకొనే, రణ్వీర్ సింగ్ ఏ ముహూర్తంలో రాంలీలా సినిమాలో చేశారో గానీ, అప్పటినుంచి వాళ్లిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీదే కాదు.. బయట కూడా తెగ పండిపోతోంది. దీని గురించి ఎవరేమనుకున్నా పట్టించుకునే పరిస్థితిలో వాళ్లిద్దరూ లేరని సినీ పండితులు చెబుతున్నారు. దానికి తగ్గట్లే రణ్వీర్ సింగ్ కూడా చెబుతున్నాడు. దీపికకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని తాజాగా చెప్పాడు. అయితే తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని అంటున్నాడు. ''దీపికకు నా జీవితంలో ప్రత్యేక స్థానముంది. నేను చాలా గౌరవించి, ఆరాధించే వ్యక్తుల్లో ఆమె ఒకరు. ఆమెకు చాలా సన్నిహితంగా నేను ఎదిగాను. ఆమె చాలా అద్భుతమైన వ్యక్తి. ఆమె అంటే నాకు చెప్పలేనంత ఆరాధన ఉంది'' అని రణ్వీర్ అన్నాడు. రాం లీలా సినిమా విడుదలైన తర్వాత నుంచి బయట ఏ పార్టీలో చూసినా వీరిద్దరి జంట తెగ కనపడుతోంది. అయితే, తమ మధ్య సంబంధం ఉన్నమాట మాత్రం వాస్తవం కాదని, బయటకు తిరగడం మామూలేనని రణ్వీర్ చెప్పాడు. ఆమెతోనే కాదు, ఇంకా చాలామందితో తాను బయటకు వెళ్తుంటానని అన్నాడు.
వాళ్లందరూ దీపిక అంత ఫేమస్ కాదు కాబట్టి ఎవరికీ తెలియట్లేదని అన్నాడు. కలిసి తిరగడానికి దీపిక చాలా కూల్గా ఉంటుందని, ఆమె కంపెనీని తానెంతగానో ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. అర్జున్ కపూర్ లాంటి స్కూలు స్నేహితులు, అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడా తాను కలిసి బయటకు వెళ్తుంటానని, అందరు స్నేహితులను చాలా పట్టించుకుంటానని రణ్వీర్ అన్నాడు. ప్రస్తుతానికి సింగిల్గానే ఉన్నానని, ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించేశాడు. తనకు లవేరియా వచ్చిందని గతంలో చెప్పిన మాట నిజమే కానీ, అది చాలా చెత్త ఇంటర్వ్యూ అని, దాన్ని పట్టించుకోవద్దని ఇప్పుడు అంటున్నాడు.