దీపికా పదుకోనె హ్యట్రిక్!
దీపికా పదుకోనె హ్యట్రిక్!
Published Mon, Nov 18 2013 3:26 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
రామ్ లీలా చిత్రం విజయం సాధించడంతో బాలీవుడ్ తార దీపిక పదుకోనే హ్యట్రిక్ సాధించింది. రామ్ లీలా చిత్రంలో దీపిక నటనపై విమర్శకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2013 సంవత్సరంలో 'యే జవానీ హై దీవాని', 'చెన్నై ఎక్స్ ప్రెస్' సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్న దీపిక రామ్ లీలాతో వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది.
యే జవానీ చిత్రంలో నైనా, చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో మీనమ్మ, రామ్ లీలాలో గుజరాతీ యువతిగా మూడు విభిన్నమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను ఆలరించింది. రామ్ లీలా చిత్రంలో అందంతోనే కాక, తన అభినయంతో కూడా దీపిక మంచి మార్కులు కొట్టేసింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన రామ్ లీలా చిత్రంలో రణ్ వీర్ సింగ్ సరసన దీపిక పదుకోనె నటించింది.
Advertisement
Advertisement