దీపికా, రణ్‌వీర్‌లు చాలా అన్యోన్యంగా...
దీపికా, రణ్‌వీర్‌లు చాలా అన్యోన్యంగా...
Published Thu, Sep 19 2013 1:57 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
మొన్న... క్రికెటర్లు యువరాజ్ సింగ్... ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని. నిన్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్... ఆ మధ్యలో సిద్దార్థ్ మాల్యా... ఇదంతా దీపికా పదుకొనే ప్రణయ జాబితా. తాజాగా ఈ జాబితాలో ‘లుటేరా’ హీరో రణ్‌వీర్‌సింగ్ చేరారంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగా రూమార్లు షికారు చేస్తున్నాయి.
మీడియా రూమర్లకు మరింత బలం చేకూర్చే విధంగా దీపికా, రణ్‌వీర్‌లు ఎక్కడపడితే అక్కడ చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చారిత్రాత్మక ప్రేమకథా చిత్రం ‘రామ్‌లీలా’లో వీరిద్దరూ ప్రేమికులుగా నటిస్తున్నారు.
తెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా ప్రేమ పక్షులుగా మారారని వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల ‘రామ్‌లీలా’ చిత్రం కోసం చిత్రీకరించిన ఓ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ సోషల్ మీడియాలో కాక పుట్టించింది. అంతేకాక ఇటీవల ‘రామ్‌లీలా’ ప్రచార చిత్రం విడుదల కార్యక్రమంలో రణ్‌వీర్, దీపికాలు వేదికపై చెలరేగిపోవడం టాక్ ఆఫ్ ది బాలీవుడ్‌గా మారింది.
Advertisement
Advertisement