‘రామ్ లీలా ’ లో ఐశ్వర్య స్పెషల్ సాంగ్ లేదు | No Aishwarya Rai item song in my film: Sanjay Leela Bhansali | Sakshi
Sakshi News home page

‘రామ్ లీలా ’ లో ఐశ్వర్య స్పెషల్ సాంగ్ లేదు

Published Sat, Aug 10 2013 1:00 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

‘రామ్ లీలా ’ లో ఐశ్వర్య స్పెషల్ సాంగ్ లేదు

‘రామ్ లీలా ’ లో ఐశ్వర్య స్పెషల్ సాంగ్ లేదు

గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న అందాల తార  ఐశ్వర్యరాయ్ ఓ ఐటం సాంగ్తో రీఎంట్రీ ఇస్తుందన్న వార్తను దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కొట్టిపారేశారు. భన్సాలీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న  ‘రామ్ లీలా ’ సినిమాలో ఐష్  ఐటెం సాంగ్ను నర్తిస్తుందన్న వార్తలు  బాలీవుడ్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్సులో ఎలాంటి వాస్తవం లేదని భన్సాలీ స్పష్టం చేశారు.

ఐశ్వర్య రాయ్ ఒక బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఐష్ రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో 'రామ్ లీలా' చిత్రంలో తమ అభిమాన తార ఐటం సాంగ్ చేస్తుందనే వార్తలు వారికి సంతోషాన్ని ఇచ్చాయి. భన్సాలీ దర్శకత్వం వహించిన 'దేవదాస్', 'గుజారీష్' చిత్రాల్లో ఐశ్వర్య నటించటంతో ...ఆ సాన్నిహిత్యం, గౌరవం కారణంగానే సంజయ్ అడగ్గానే ఐశ్వర్యారాయ్ ప్రత్యేక గీతం చేసేందుకు ఒప్పేసుకుందని కథనాలు వెలువడ్డాయి. మొదటి సోనాక్షి సిన్హా అన్నారు, ఆ తర్వాత మాధురి దీక్షిత్ అన్నారు...ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఎలా ప్రచారంలోకి వస్తాయో అర్థం కావడం లేదంటూ భన్సాలీ వ్యాఖ్యానించారు. భన్సాలీ వివరణతో ఐశ్వర్యారాయ్ ఐటం సాంగ్  రూమర్స్కు తెరపడినట్లుయింది.

ఇక ఐశ్వర్యారాయ్ తన సమయాన్ని అంతా కుమార్తె ఆరాధ్యకే కేటాయిస్తోంది. ప్రస్తుతం ఐష్.... ఆరాధ్యకే ప్రాధాన్యత ఇస్తుందని, ఆరాధ్య కంటే తనకు ఏదీ ముఖ్యంగా కాదని ఐశ్వర్య భావిస్తుందని ఆమె సన్నిహితులు తెలిపారు. అయితే మంచి కథ దొరికితే త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని పేర్కొన్నారు.  కాగా 1983లో వచ్చిన  'మసూమ్‌' సినిమా రీమేక్‌లో ఐశ్వర్య రాయ్‌ నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది.

దాదాపు 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. శేఖర్‌ కపూర్‌ రూపొందించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్‌ షా, షబానా అజ్మి జంటగా నటించారు. ఇప్పుడు వారి పాత్రల్లో అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ నటిస్తారని వార్తలొస్తున్నాయి. హిమేష్‌ రేషమ్మియా ఈ చిత్రాన్ని తాజాగా నిర్మించబోతున్నాడు. ఐశ్వర్య సౌలభ్యం మేరకు షెడ్యూల్ రూపొందించుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో త్వరలో ఐష్ రీఎంట్రీ మాత్రం ఖాయమనేది తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement