సంజయ్ లీలా భన్సాలీ తీసిన రాం లీలా చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అదరగొట్టే ఐటెం డాన్సు చేసింది. తెల్లటి చోళీ, లుంగీతో తన వంపుసొంపులను ప్రదర్శించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఆమె వేసుకున్న దుస్తుల పుణ్యమాని.. పక్కటెముకల మీద వేయించుకున్న టాటూ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుదేవా సోదరుడు విష్ణుదేవా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసినట్లు సమాచారం.