దీపికాతో నా కెమిస్ట్రీ అదుర్స్: రణ్వీర్ సింగ్ | My chemistry with Deepika highlight of 'Ram Leela': Ranveer singh | Sakshi
Sakshi News home page

దీపికాతో నా కెమిస్ట్రీ అదుర్స్: రణ్వీర్ సింగ్

Published Mon, Sep 16 2013 10:09 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

దీపికాతో నా కెమిస్ట్రీ అదుర్స్: రణ్వీర్ సింగ్

దీపికాతో నా కెమిస్ట్రీ అదుర్స్: రణ్వీర్ సింగ్

'రాంలీలా' సినిమాలో దీపికా పదుకొనేతో తన కెమిస్ట్రీ అదిరిపోయిందని, అది ఆ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని హీరో రణ్వీర్ సింగ్ అన్నాడు. ఇటీవలి కాలంలో దీపికతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు వార్తల్లో నిలిచిన అతగాడు రాంలీలా చిత్రం గురించి మాట్లాడాడు.  తామిద్దరం ఈ చిత్రంలో కలిసి నటించాలని రాసిపెట్టి ఉందని.. రోమియో-జూలియట్ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తమ మధ్య కూడా అలాగే ఉందని చెప్పాడు. ఇదే ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని విలేకరులతో అన్నాడు. కానీ, దీపికతో అసలైన రొమాన్స్ గురించి ప్రశ్నిస్తే మాత్రం నోరు విప్పలేదు. ఈ సినిమాలో దీపిక- రణ్వీర్ పెదాలు కలిపిన సన్నివేశాలున్నాయి.

ఈ సినిమా అమ్మకే అంకితం: భన్సాలీ
రాం లీలా చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని, ఈ చిత్రాన్ని తాను తన తల్లి కోసమే తీశానని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చెప్పాడు. ఈ సినిమాను అమ్మకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. సినిమాలో లీల పాత్ర పోషించిన దీపిక చాలా అద్భుతంగా చేసిందంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. సినిమా ట్రైలర్ను భన్సాలీ ముంబైలో విడుదల చేశాడు. రణ్వీర్ మంచి నటుడని, అతడిలో చాలా ఎనర్జీ ఉందని అన్నాడు. ఇక భన్సాలీని ఒక మెజీషియన్గా దీపిక అభివర్ణించింది. ''సంజయ్ కళాకారుడే కాదు.. మెజీషియన్. ఆయన ప్రతి ఒక్క సీన్ను చాలా అద్భుతంగా, అందంగా తీస్తారు. మహిళల దుస్తులను బాగా అర్థం చేసుకున్న ఏకైక మగ దర్శకుడు ఆయన మాత్రమే'' అని కితాబిచ్చింది. ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement