దోస్తానా అంటే ఇదికదా! స్నేహితుడు మార్నింగ్‌ వాక్‌కి రావటం లేదని.. | Friend Not Coming For Morning Walk Than Friends Decided To | Sakshi
Sakshi News home page

దోస్తానా అంటే ఇదికదా! స్నేహితుడు మార్నింగ్‌ వాక్‌కి రావటం లేదని..

Published Tue, Oct 31 2023 3:17 PM | Last Updated on Tue, Oct 31 2023 3:26 PM

Friend Not Coming For Morning Walk Than Friends Decided To - Sakshi

ఫ్రెండ్‌ అనే పదంలోనే.. ఏదైన సమస్య వస్తే మనల్ని బయటపడేలా అండగా నిలబడే వాడని అర్థం. సాయం చేయలేకపోయినా.. కనీసం మనకు పరిష్కరమైనా చెప్పి సమస్య నుంచి బయటపడే యత్నం చేస్తాడు. మంచి స్నేహితులను పొందడం అనేది ఓ గొప్ప వరం. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇక్కడొక స్నేహితుడు వాకింగ్‌ చేయడానికి రావడం లేదని అతడి దోస్తులంతా చేసిన పని నిజంగా నవ్వు తెప్పిస్తుంది.

ఏం చేశారంటే..
పాపం అతడు కూడా తమతో వాకింగ్‌కి వచ్చి సరదాగా గడపడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండాలని కోరుకున్నారు. ఎంతలా చెప్పి చూశారో ఏమో మనోడు అస్సలు వాకింగ్‌ వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కాబోలు. దీంతో విసిగిపోయిన అతడి స్నేహితులు లాభం లేదనుకుని ఏకంగా బ్యాండ్‌ బాజాలతో అతని ఇంటికి వెళ్లి మరీ స్వాగతం పలికారు. దీంతో ఆ స్నేహితుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. వస్తాన్రా బాబు అని దండం పెట్టి మరీ వేడుకుంటున్నాడు. ఆపండ్రా ఆ బ్యాండ్‌ బాజాలు వాయించడం ఓ రెండు నిమిషాలు టైం ఇవ్వండి అని అడుగుతున్నా..ఆపద్దు వాయించండి వచ్చేంత వరకు అంటున్నారు అతడి దోస్తులు. స్నేహం అంటే ఇది కదా! స్నేహితుడి బద్ధకం వదిలించి మరీ వాకింగ్‌ తీసుకువెళ్లాలనుకుంటున్నా అతడి దోస్తులు నిజంగా గ్రేట్‌!. మేలు కోరే స్నేహితులు దొరకడం కూడా ఓ అదృష్టం కదూ!.

(చదవండి: అద్భుతమైన డెవిల్స్‌ బ్రిడ్జ్‌! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement