సందడిగా పింక్ రిబ్బన్ వాక్ | Bustling Pink Ribbon Walk | Sakshi
Sakshi News home page

సందడిగా పింక్ రిబ్బన్ వాక్

Published Mon, Oct 12 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

సందడిగా పింక్ రిబ్బన్ వాక్

సందడిగా పింక్ రిబ్బన్ వాక్

ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు

ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు ముందు పింక్‌రిబ్బన్ వాక్ సందడిగా జరిగింది. మంత్రి హరీష్‌రావు వాక్‌ను ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్ లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.  బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యపై అందరూ పోరు సాగించాలన్నారు.

ఉషాలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఉషాలక్ష్మి, కిమ్స్ చైర్మన్ బి.కృష్ణయ్య, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చందా, క్రికెటర్ మిథాలిరాజ్, సినీ నటులు లావణ్య త్రిపాఠి, మంచులక్ష్మి, యూబీఎఫ్ పాట్రన్ పింకిరెడ్డి, రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ర్యాలీ కొనసాగింది.
 కార్యక్రమంలో మంచులక్ష్మి కుమార్తె విద్యానిర్వాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.     - బంజారాహిల్స్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement