జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
నా వయసు 35. రోజూ జాగింగ్‌ను చేస్తాను. నాకు చెమటలు ఎక్కువ. నాలాంటి వారికి డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందని విన్నాను. నాకు తగిన సూచనలు ఇవ్వండి.
- రఘురామ్, నకిరేకల్
జాగింగ్ మొదలుపెట్టడానికి ముందుగా కనీసం నాలుగు వారాల పాటు వేగంగా నడక (బ్రిస్క్‌వాకింగ్) కొనసాగించడం మేలు. జాగింగ్‌కు అనువైన షూస్ ఎంచుకోవడం చాలా అవసరం. సుమారు ప్రతి 1000 కి.మీ. పరుగు తర్వాత ఆ షూస్ మార్చేయాలి. లేకపోతే చూడటానికి షూ బాగానే అనిపించినా సోల్ అరుగుదల వల్ల అడుగులు పడే తీరులో మార్పు వచ్చి దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు కనిపిస్తాయి. ఇక జాగింగ్ వ్యవధి విషయానికి వస్తే రోజూ కనీసం అరగంట నుంచి 45 నిమిషాల పాటు స్లోజాగింగ్ చేయడం మేలు. జాగింగ్ చేయడానికి ముందుగా ఎవరైనా సరే... జాగింగ్‌కు ముందూ, జాగింగ్ తర్వాత స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. డీ-హైడ్రేషన్‌ను దీన్ని గుర్తించడం చాలా తేలిక.
మీరు పరుగెత్తుతున్నప్పుడు చెమటల వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు, లవణాలను కోల్పోయి, వాటి (ఎలక్ట్రోలైట్స్) సమతౌల్యత చెబుతుంది. ఈ కండిషన్‌ను డీ-హైడ్రేషన్‌గా పేర్కొనవచ్చు. మీరు డీ-హైడ్రేషన్‌కు గురైతే మీకు స్వల్పంగా తలనొప్పి రావడం, దాహం వేస్తూ ఉండటం, చురుకుతనం తగ్గినట్లుగా అనిపించడం, వికారం, కండరాలు బిగుసుకుపోయి, పట్టివేసినట్లుగా అయిపోవడం (మజిల్ క్రాంప్స్), నీరసం, ఉమ్ము కూడా రాకపోవడం, ఒకవేళ ఊసినా అది చాలా చిక్కగా ఉండటం, తీవ్రమైన నిస్సత్తువకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే జాగింగ్ లేదా రన్నింగ్ చేసేవారు తగినంతగా నీళ్లు తాగాలి. లేకపోతే అది హైపోనేట్రీమియా (శరీరంలో సోడియమ్ లవణాల పాళ్లు తగ్గడం) అనే కండిషన్‌కు దారితీయవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితే. దీన్ని నివారించాలంటే మీరు స్థూలకాయులైతే జాగింగ్ మొదలుపెట్టడానికి ముందే శరీర బరువును తగ్గించుకోవడం అవసరం.
ఇక జాగింగ్ చేసే సమయాల్లో తమ శరీరం ఉజ్జాయింపుగా ఎన్ని నీళ్లను కోల్పోతుందో గుర్తించి ఆ మేరకు (లవణాలతో కూడిన నీళ్లు లేదా కొబ్బరినీళ్లు) తీసుకోవాలి. ఉదాహరణకు జాగింగ్ చేయడానికి ముందు మీ శరీరం బరువు 63 కిలోలు ఉందనుకుందాం. అరగంట జాగింగ్ తర్వాత మీ బరువు 62.6 కిలోలు ఉందనుకుందా. అంటే అరగంటలో మీరు 0.4 కిలోల బరువు కోల్పోయారు. అందుకే ఉజ్జాయింపుగా మీరు 400 మిల్లీలీటర్లు లేదా గంట జాగింగ్ చేసేవారైతే 800 మిల్లీలీటర్లు (దాదాపు ఒక లీటరు నీరు) తాగి, మీరు కోల్పోయిన ఫ్లూయిడ్స్ భర్తీ చేసుకోవడం మేలు. అయితే నీటిని గింగ్/రన్నింగ్ ముగిసిన కొద్ది వ్యవధి / విశ్రాంతి తర్వాత తీసుకోవడం అన్నివిధాలా మేలు.
డాక్టర్ ప్రవీణ్‌రావు,
సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్,
యశోద హాస్పిటల్స్,
సికింద్రాబాద్
డీ-హైడ్రేషన్‌ను గుర్తించేదెలా?
Published Tue, Aug 25 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement